NTV Telugu Site icon

The Kerala Story: ఆస్కార్ బరిలో వివాదాస్పద సినిమా.. ?

Kerala

Kerala

The Kerala Story: ది కేరళ స్టోరీ.. ఈ ఏడాది వివాదాస్పద చిత్రాల్లో ఇదొకటి. ఈ సినిమా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కేరళను మాత్రమే కాదు.. మొత్తం తమిళనాడు ఓ ఆట ఆడుకున్న సినిమా ది కేరళ స్టోరీ. ఎన్నో వివాదాలు.. ఎన్నో ఆరోపణలు.. మరెన్నో అవమానాలు అన్ని ఎదుర్కొని విజేతగా నిలిచింది. ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించాడు. మే 5 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు కలక్షన్స్ రాబట్టింది. కేరళకు చెందిన కొందరు మహిళలు ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా లో ఎలా ఉన్నారు. ఇదంతా తెల్సినా కేరళ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది .. ఇక చివరకు ఆ మహిళలు ఏమయ్యారు.. ? తిరిగి ఇండియాకు చేరుకున్నారా.. ? అనేది కేరళ స్టోరీ కధాంశం.

Jailer: జైలర్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే.. ?

అసలు కేరళలో ఇలాంటి ఘటన జరగలేదు అని రాజకీయ నేతలు చెప్పుకురావడమే కాకుండా ఈ సినిమాను బ్యాన్ కూడా చేశారు. అయినా కూడా సినిమాను చూసే ప్రేక్షకులను మాత్రం ఆపలేకపోయారు. ఇప్పటివరకు కలక్షన్స్ ను కొల్లగొట్టిన ఈ సినిమా .. ఈసారి అవార్డులను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ది కేరళ స్టోరీ సినిమాను.. ఆస్కార్ నామినేషన్స్ కు పంపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో బలగం, దసరా సినిమాలను ఆస్కార్ నామినేషన్స్ కోసం అధికారికంగా పంపనున్నారని టాక్ నడుస్తోంది. ఇక కోలీవుడ్ నుంచి ది కేరళ స్టోరీ ని పంపించడానికి మేకర్స్ కృషిచేస్తున్నారట. ఇది కనుక నిజమైతే మరోసారి తమిళనాడులో వివాదాలు రేగడం ఖాయమని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి.