The Kashmir Files చిత్రంతో వార్తల్లో నిలిచిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ప్రభుత్వం అత్యన్నత భద్రతను అందించడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన The Kashmir Files మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్‌లపై 1990లో జరిగిన అఘాయిత్యాలను చూపించారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో కాశ్మీర్ లోయ నుండి కాశ్మీరీ హిందువుల వలసల ఆధారంగా రూపొందించబడింది. అయితే పీఎం మోడీతో సహా చాలామంది సినిమాపై ప్రశంసలు కురిపించినప్పటికీ, మరో వర్గం నుంచి విమర్శలు ఎదురయ్యాయి. బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తున్న ఈ మూవీకి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు వినోద పన్ను మినహాయింపును ఇచ్చాయి.
Read Also : Prakash Raj : “ది కాశ్మీర్ ఫైల్స్” గాయాలను మాన్పుతోందా ? రేపుతోందా?
అయితే ఈ సినిమాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ రావడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ చిత్రం అనేక సినిమా థియేటర్ల వద్ద హింసాత్మక నినాదాలకు దారి తీసింది. గాయాలను మాన్పడానికి బదులుగా, ఈ చిత్రం అనుకోకుండా రెండు వర్గాల మధ్య మరింత ద్వేషానికి దారి తీసింది. సోషల్ మీడియా సినిమా థియేటర్‌ల లోపల, వెలుపల జరిగిన కొన్ని అనూహ్య సంఘటనల వీడియోలతో నిండిపోయింది. అయితే ఈ సినిమా వివాదాస్పదంగా మారడంతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ‘వై’ క్యాటగిరీ భద్రతను కల్పించారు. సీఆర్పీఎఫ్ జవాన్లతో ఆయనకు భద్రత ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెల్సింది.
