Site icon NTV Telugu

Khushboo Patani : చిన్నారిని కాపాడిన హీరోయిన్ చెల్లెలు.. ప్రముఖుల ప్రశంసలు

Khushboo Patani

Khushboo Patani

బాలీవుడ్ భామ దిశా పటాని సుపరిచితమే. లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె సోదరి ఖుష్బూ పటాని అంతగా ఎవరికి పరిచయం లేకపోవచ్చు. ఇప్పుడు ఖుష్బూ పటాని చేసిన పనికి దేశం మొత్తం ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతోంది. మాజీ ఆర్మీ అధికారి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఖుష్బూ పటాని ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటోంది.

Also Read : Vijay : భారీ ధర పలికిన ‘జననాయగన్‌’ తమిళనాడు థియేట్రీకల్ రైట్స్

రోజులాగే ఈ ఆదివారం ఉదయం కూడా వాకింగ్‌కు బయలుదేరింది ఖుష్బూ. అయితే ఆమె నివసిస్తున్న ఇంటి నుండి కొద్దీ దూరం వెళ్ళగానే  ఓ  పాడుబడిన ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో అనుమానం వచ్చి అక్కడికి వెళ్లి చూడగా ఓ చిన్నారి ఏడుస్తూ మట్టిలో పడివుండడం గమనించి మనసు తరుక్కుపోయింది. దాంతో ఇంట్లోకి ప్రవేశించేందుకు దారి లేకపోవడంతో వెనుక గోడ ఎక్కి దూకి లోపలోకి ప్రవేసించి చిన్నారిని  కాపాడింది. ఆ చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లి తల్లిలా లాలించి అక్కున చేర్చుకుంది. చిన్నారిని అక్కడ వదిలి వెళ్లిన వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిన్నారి తల్లితండ్రులు ఎవరో కనిపెట్టాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్ అలాగే అక్కడి పోలీసులను ఇన్ స్టా లో ట్యాగ్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ చిన్నారి పేరు రాధా అని వారి తల్లితండ్రుల ఆచూకీ కనుగొని ఖుష్బూకు సమాచారం అందించారు. ప్రస్తుతం రాధను ఆమె తల్లి తండ్రులకు అప్పగించారు. ఎవరో రాధను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు ఈ వ్యవహారాన్ని నిశితంగా  పరిశీలిస్తున్నారు. ఖుష్బూ చేసిన పనికి సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.చిన్నారిని కాపాడిన హీరోయిన్ చెల్లెలు

Exit mobile version