Site icon NTV Telugu

‘The Girlfriend’ : ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ పార్టీ అప్ డేట్..

The Girl Friend

The Girl Friend

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా, గీతా ఆర్ట్స్ నిర్మాణం చేపట్టింది. రిలీజ్‌ అయినప్పటి నుంచి మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్‌లతో పాటు వీక్‌డేస్‌ లో కూడా హౌస్‌ఫుల్‌ షోలు నమోదు చేస్తూ జోరుగా దూసుకుపోతోంది. ఈ విజయాన్ని గుర్తుగా చిత్రబృందం నవంబర్‌ 12న ఒక గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ హాజరుకానున్నారని సమాచారం. దాంతో ఈ సక్సెస్‌ పార్టీ మరింత గ్రాండ్‌గా జరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఎంగేజ్‌మెంట్‌ రూమర్స్‌ తర్వాత రష్మిక–విజయ్‌ ఒకే వేదికపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా మూవీ టీం “ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో విజయోత్సవ వేడుకలు జరగనున్నాయి” అంటూ ట్వీట్‌ చేసింది. మొత్తానికి, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీమ్‌ సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకునేలా రెడీగా ఉంది.

 

Exit mobile version