Site icon NTV Telugu

The Girlfriend : “ది గర్ల్‌ఫ్రెండ్” రెండవ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Garl Fraiend

Garl Fraiend

బ్యాక్‌ టూ బ్యాక్‌ భారీ సినిమాల్లో ధూసుకుపోతున్న ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. ‘యానిమల్‌’ నుంచి మొదలైన ఆమె జోరు.. ‘పుష్ప2’, ‘ఛావా’ వంటి చిత్రాలతో అలరించింది. బాక్సాఫీసుని షేక్‌ చేసింది.చివరగా సల్మాన్‌ ఖాన్‌తో ‘సికందర్‌’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చినప్పటికి.. ఇది నిరాశ పరిచింది. ఇక ఇటీవలే నాగార్జున, ధనుష్‌ కలిసి నటించిన ‘కుబేర’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది. `ది గర్ల్ ఫ్రెండ్‌`. `ఆడవాళ్లు మీకు జోహార్లు` వంటి చిత్రాలతో అలరించబోతోంది. ఇందులో

Also Read : Surya : సూర్య కోసం భారీ సెట్.. వెంకీ అట్లూరి సినిమా నెక్స్ట్ లెవెల్!

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. టాలెంటెడ్ దీక్షిత్ శెట్టి హీరో గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ఎంతో ఆకట్టుకోగా, తాజాగా సెకండ్ సింగిల్ కూడా డేట్ ఫిక్స్ చేశారు. ప్రేమలో జరిగే ప్రతి అనుభవం, ప్రతి క్షణం తన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ రెండవ సింగిల్ ఆగస్టు 26న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. దీని గురించి అధికారికంగా ప్రకటిస్తూ ఓ రొమాంటిక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

 

Exit mobile version