Site icon NTV Telugu

The Flash: ఈ ట్రైలర్ చూస్తుంటే ఆదిపురుష్ సినిమాకి కష్టాలు తప్పేలా లేవు

The Flash

The Flash

వార్నర్ బ్రదర్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ది ఫ్లాష్’ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఈ మూవీ ఫైనల్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. DCU లవర్స్ ని ఎగ్జైట్ చేసిన ‘ది ఫ్లాష్’ ఫైనల్ ట్రైలర్ సెన్సేషనల్ వ్యూస్ ని రాబడుతుంది. దీనికి కారణం ది ఫ్లాష్ అఫీషియల్ ట్రైలర్ లో ‘బాట్ మాన్’, ‘సూపర్ వుమెన్’ కూడా కనిపించడమే. ట్రైలర్ చూస్తుంటే బాట్ మాన్ క్యారెక్టర్ ది ఫ్లాష్ మూవీలో ఫుల్ లెంగ్త్ ఉన్నట్లు అనిపిస్తుంది. జనరల్ జాడ్ గా మైఖేల్ షనన్ కూడా కనిపించడంతో ది ఫ్లాష్ ట్రైలర్ మరింత స్పెషల్ గా మారింది. సూపర్బ్ విజువల్ ఎఫెక్ట్స్ ఫ్లాష్ ట్రైలర్ ని వర్త్ వాచ్ గా మార్చాయి. ట్రైలర్ తో ది ఫ్లాష్ మూవీపై ఎక్స్పెక్టేషన్ అమాంతం పెరిగాయి. ఇదే రేంజులో మూవీ ఉంటే DCUలో ది ఫ్లాష్ చాలా స్పెషల్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. బాట్ మాన్ క్యారెక్టర్ కి ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ది ఫ్లాష్ మూవీ ఇండియాలోనే A సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది.

అయితే ది ఫ్లాష్ రిలీజ్ అవుతున్న డేట్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ కూడా రిలీజ్ అవుతోంది. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో ప్రభాస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా సత్తా చాటాలి అనుకుంటున్నాడు. ఆదిపురుష్ ఓవర్సేస్ కలెక్షన్స్ కి ది ఫ్లాష్ మూవీ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో ప్రభాస్ ఇంపాక్ట్ కూడా ది ఫ్లాష్ మూవీపై గ్యారెంటీగా పడుతుంది. ఈ రెండు సినిమాలు ఒకే డేట్ కి రిలీజ్ అవుతూ ఉండడం ఆడియన్స్ కి మాత్రం మంచి కిక్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆది పురుష్ ఇంపాక్ట్ ది ఫ్లాష్ పైన ఉంటుందా? లేక ది ఫ్లాష్ సినిమానే మల్టీప్లెక్స్ ల్లో ఆదిపురుష్ కలెక్షన్స్ కి డెంట్ పెడుతుందా అనేది చూడాలి.

 

 

Exit mobile version