NTV Telugu Site icon

Kannappa: ‘కన్నప్ప’ నుండి శివ శివ శంకర.. ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

February 7 (59)

February 7 (59)

మంచు విష్ణు లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘కన్నప్ప’.  టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఇది కూడా ఒకటి.ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది .ఇక ఈ చిత్రం భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతూ ఉండటంతో అంచనాలు పెరిగి పోయినప్పటికీ, అఫీషియల్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత, హైప్ పెరగాల్సింది పోయి భారీ ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అలా ఈ సినిమాపై ఇప్పటివరకూ పాజిటివ్ కామెంట్ల కంటే ట్రోల్స్‌యే ఎక్కువ వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇటీవల ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అయితే మంచు ఫ్యామిలీపై విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ‘శివ శివ శంకర’ అంటూ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.

Also Read:Munna Bhai: మున్నా భాయ్ 3లో నాగార్జున..?

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సింగర్ విజయ్‌ ప్రకాశ్‌ పాడారు. కాగా ఇప్పటి వరకు వచ్చిన ట్రోల్స్‌కి ఈ ఒకే ఒక్క పాటతో సమాధానమిచ్చారు మంచు విష్ణు. ‘శివ శివ శంకర’ అంటూ సాగిన ఈ పాట వినగానే ఒక్కసారిగా సినిమా మీద పాజిటివ్ నెస్ అయితే పెరిగింది అని చెప్పాలి. మరిక సినిమా నుండి వచ్చే ఇతర కంటెంట్ కూడా ఇదే విధంగా మెప్పిస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ‘కన్నప్ప’ భారీ విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది.