Site icon NTV Telugu

అజిత్ ‘తలా’ బిరుదు తొలగింపుపై రాజమౌళి కామెంట్స్

Rajamouli-and-ajith

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాలిమై’ ట్రైలర్ తాజాగా విడుదలై రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ అంతటా ‘వాలిమై’ మాయలో పడిపోయింది. ఈ క్రమంలో అజిత్ పై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అజిత్ ను అభిమానులు ప్రేమగా ‘తలా’ అని పిలుచుకునేవారు. అయితే డిసెంబర్ 1న అజిత్ షాకింగ్ ప్రకటన చేశారు. సినీ పరిశ్రమ తనకు ఇచ్చిన గౌరవ బిరుదును నిరాకరిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తనను “తలా” అని లేదా మరే ఇతర ప్రిఫిక్స్‌లతో పిలవొద్దని మీడియాను, అభిమానులను అభ్యర్థించాడు. దీంతో అభిమానులు నిరాశకు గురైనప్పటికీ కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌ ఇలాంటి పని చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక తాజాగా సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దీనిపై స్పందిస్తూ అజిత్ అలాంటి ప్రకటన చేసినందుకు తాను పూర్తిగా ఇంప్రెస్ అయ్యానని చెప్పాడు.

Read Also : టికెట్ రేట్ల తగ్గింపుతో పవన్ కు ఫరక్ పడదు : ఆర్జీవీ

రాజమౌళి ఈ విషయంపై మాట్లాడుతూ “ఇటీవల అజిత్ చేసిన పనిని నేను నిజంగా అభినందిస్తున్నాను. కోట్లాది మంది అభిమానులు ఆయనను ‘తలా’ అని ఉత్సాహంగా పిలుస్తారు. కానీ ఇక నుండి తనను #Thala అని పిలవడం మానుకోవాలని అభిమానులను కోరుతున్నాను అని, తనను కేవలం అజిత్ / ఏకే / అజిత్‌ కుమార్ అని మాత్రమే పిలవాలని చెప్పడం అభినందనీయం” అంటూ అజిత్ ను ప్రశంసించారు.

2001లో అజిత్ నటించిన చిత్రం ‘ధీనా’ తరువాత అందరూ ఆయనను ‘తలా’ అని పిలవడం మొదలు పెట్టారు. ఒక పాట సీక్వెన్స్ సమయంలో సహాయక పాత్రలలో ఒకరు అజిత్‌ని “తల” అని పిలుస్తారు. ‘తలా’ అంటే అంటే చీఫ్ లేదా ఉన్నతమైన వ్యక్తి అని అర్థం.

Exit mobile version