NTV Telugu Site icon

The Family Star: మిడిల్ క్లాస్ అన్నావ్ కదా అన్నా.. అంబానీ రేంజ్ లో పెళ్లి చేసుకుంటున్నావ్

Vijay

Vijay

The Family Star: స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. కళ్యాణి వచ్చా వచ్చా.. పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా అంటూ సాగే ఈ సాంగ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వస్తుందని తెలుస్తోంది.

కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా.. ధమకు ధమా ధమారి, ఛమకు ఛమా ఛమారి, సయ్యారి సరాసరి మొదలుపెట్టే సవారి, డుమకు డుమా డుమారి, జమకు జమా జమారి, ముస్తాభై ఉన్నామని అదరగొట్టేయ్ కచేరి.. అంటూ పెళ్లి సందడిని రెట్టింపు చేసేలా సాగిందీ పాట. ఈ సాంగ్ కు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా…మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్ గా పాడారు. గోపీ సుందర్ మంచి డ్యాన్స్ నెంబర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే.. ఆ విజువల్స్, విజయ్, మృణాల్ కాస్ట్యూమ్స్ మొత్తం నెక్ట్ లెవెల్ అనిపిస్తుంది. రాయల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లా కనిపిస్తున్నాయి. ఇక ఈ సాంగ్ విజువల్స్ చూసిన అభిమానులు..మిడిల్ క్లాస్ అన్నావ్ కదా అన్నా.. అంబానీ రేంజ్ లో పెళ్లి చేసుకుంటున్నావ్ ఏంటి అని ప్రశ్నలు వేస్తున్నారు. టీజర్ లో పిల్లను బైక్ ఎక్కించుకొని డ్రాప్ చేయడానికే వంద పెట్రోల్ కొట్టిస్తా అని చెప్పాడు.. ఇప్పుడేమో కోట్లు ఖర్చుపెట్టి పెళ్లి చేసుకుంటున్నాడా.. ? అని సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.