యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
Also Read : ShowTime Review : నవీన్ చంద్ర షో టైమ్ రివ్యూ
అయితే ఈ సినిమా రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేస్తుంది యష్ రాజ్ ఫిల్మ్స్. ఇండియన్ సినిమా హిస్టరీలోనే జరగనటువంటి రీతిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. వినిపిస్తున్న సమాచారం ప్రకారం వార్2 ను ఇండియా వైడ్ గా సుమారు 9,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే ఇది ఓ హిస్టరీ అనే చెప్పాలి. ఇప్పటి వరకు అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఇండియాన్ సినిమాల లిస్ట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.O మొత్తం 7,500 స్క్రీన్స్ పేరిట ఉంది. ఇప్పడు దాన్ని బీట్ చేయబోతుంది వార్ 2. ఇటు తెలుగు స్టేట్స్ లోను వార్ 2 రిలీజ్ కు భారీ ఏర్పాట్లు జారుతున్నాయి. ఈ సినిమా రైట్స్ ను సితార నాగవంశీ రూ. 90 కోట్లకు కొనుగోలు చేసారు. ఇంతటి భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న వార్ 2 ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
