ShowTime Review : నవీన్ చంద్ర షో టైమ్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: NaveenChandra, KamakshiBhaskarla , Naresh Vijaya Krishna, Raja Raveendar
- DIRECTOR: Madhan Dhakshinamoorthy
- MUSIC: ShekarChandra
- PRODUCER: Garikipati kishore
అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం షో టైం. నవీన్ చంద్ర హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్న వినూత్నమైన థ్రిల్లర్ చిత్రం జూలై 4న అనగా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాపై నమ్మకంతో గత రెండు రోజులుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి షో టైమ్ తో నవీన్ చంద్ర భయపెట్టాడా లేదా చూద్దాం.
కథ : కథగా చెప్పుకోవానికి ఇది ఒక సింపుల్ లైన్. ఓ ఇంటిలో అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఫ్యామిలీ మొత్తం కూర్చుని సరదగా ముచ్చటించుకుంటుండగా అర్ధరాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ci లక్ష్మీకాంత్ ( రాజా రవీంద్ర) వార్నింగ్ ఇస్తాడు. అక్కడ సూర్య (నవీన్ చంద్ర), శాంతి ( కామాక్షి భాస్కర్ల ) సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ లక్ష్మీ కాంత్ ఏదైనా చేస్తాడేమో అని సూర్య బయపడే టైమ్ లో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ కేసు నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు. వారికి లాయర్ వరదరాజులు ( VK నరేష్) ఎలా సేవ్ చేసాడు అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.
Also Read
విశ్లేషణ : ఈ కథ మొత్తం ఒక రోజులోనే జరుగుతుంది. సింపుల్ కథను నీట్ గా ప్రెజెంట్ చేసాడు దర్శకుడు మదన్. ఫస్ట్ హాఫ్ కేవలం 45 నిడివితో ముగించి అసలు కథను సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే కథలో నరేష్ ఎంటర్ అవుతాడో అక్కడి నుండి హిలేరియస్ గా నవ్వించాడు. అదే టీమ్ లో సస్పెన్స్ ను కూడా బాగా హ్యాండిల్ చేసాడు. ఇటువంటి సినిమాలు మలయాళంలో ఎక్కవ వస్తుంటాయి. అలంటి నేపథ్యంలోనే ఒక రూమ్ లోనే సినిమాను ఆసాంతం నడిపించి ఎంగేజ్ చేశాడు దర్శకుడు మదన్. సస్పెన్స్ లో కామెడీ మిక్స్ చేయడంలో డైలాగ్స్ లో పదును చూపిస్తే వర్కౌట్ అవుతుంది. ఆ విషయంలో టీమ్ సక్సెస్ అయింది. గవిరెడ్డి శ్రీనివాస్ డైలాగ్స్ బాగా పండాయి. రాజా రవీంద్ర, నరేష్ మధ్యలో ఉండే ఎపిషోడ్ సినిమాకే హైలెట్. ఇక క్లైమాక్స్ ఊహించిన దానికి బిన్నంగా ఉంటుంది.
నటీనటుల పర్ఫామెన్స్ : నవీన్ చంద్ర ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు. ఆ అనిభావంతోనే ఈజ్ తో చేసేశాడు. VK నరేష్ తనదైన మార్క్ కామెడీతో అదరగొట్టాడు. రాజా రవీంద్ర సైకో పోలీస్ పాత్రతో సినిమాను నడిపించడంలో మేజర్ రోల్ పోషించాడు. కామాక్షి ఉన్నంతలో మెప్పించింది. ఇక జెమిని సురేష్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ పాత్రలో నవ్వించాడు. ఇక శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్ : షో.. ‘టైమ్ బాగుంది’
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!