దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్‌లో ‘వార్ 2’ సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో.. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు టైగర్. ఇటీవల సెట్స్‌మీదకు వెళ్లిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్స్ లో స్టార్ట్ చేసారు. రాస్తారోకో, అల్లర్లు వంటి సన్నివేశాలు చిత్రీకరించాడు ప్రశాంత్ నీల్. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేని సీన్స్ తీసాడు ప్రశాంత్ నీల్.
ఇక తర్వాత షెడ్యూల్ కోసం కలకత్తా వెళ్లనుంది టీమ్ సినిమాలోని కీలక సీన్స్ ను అక్కడ షూట్ చేయనున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ మార్చి నెలలో ఈ షూటింగ్‌లో జాయిన్ కావాల్సింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం డ్రాగన్ సెట్స్ లో ఎన్టీఆర్ అడుగుపెట్టేందుకు కాస్త ఆలస్యం కానుందట. ఏప్రిల్ నుండి యంగ్ టైగర్ ఈ సినిమా షూట్ లో పాల్గొనబోతున్నారట. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్‌నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. తొలిసారి ప్రశాంత్, ఎన్టీఆర్ సినిమా కావడంతో ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిట్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి. మరి ఈసారి ప్రశాంత్ నీల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడోనని సినిమా ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.