That is Mahalakshmi : నేరుగా ఓటీటీ లో విడుదల కాబోతున్న దటీజ్ మహాలక్ష్మీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంటాయి.. ఎన్నో ఏళ్ల క్రితం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయినప్పటికీ థియేట్రికల్ రిలీజ్ మాత్రం కావు.అలాంటి చిత్రాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మంచి వేదికగా నిలిచాయి. ఇప్పుడు దటీజ్ మహాలక్ష్మి చిత్రం కూడా నేరుగా ఓటీటీ లో విడుదల కానుంది.ఈ సినిమాను హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.దటీజ్ మహాలక్ష్మీ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్‌గా చేసింది. ఇది ఒక లేడి ఒరియెంటెడ్ మూవీ. బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటి కంగనా రనౌత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ క్వీన్‌కు రీమేక్‌గా తెలుగులో దటీజ్ మహాలక్ష్మీ మూవీని నిర్మించారు. తెలుగులోనే కాకుండా క్వీన్‌కు తమిళ్, కన్నడ మరియు మలయాళంలో కూడా రీమేక్ చేశారు. తమిళంలో చందమామ కాజల్ అగర్వాల్‌తో క్వీన్ మూవీని పారిస్ పారిస్ టైటిల్‌తో రీమేక్ చేశారు.క్వీన్ మూవీని మలయాళంలో జామ్ జామ్ టైటిల్‌తో మంజిమా మోహన్‌తో రీమేక్ చేయగా కన్నడలో బటర్ ఫ్లై పేరుతో పరుల్ యాదవ్‌తో తెరకెక్కించారు.
అయితే, తెలుగులో దటీజ్ మహాలక్ష్మీగా రీమేక్ అయిన ఈ సినిమా థియేటర్లలో మాత్రం విడుదల కాలేదు. 2014లో షూటింగ్ మొదలు పెట్టగా 2016లో పూర్తి అయింది. అంటే సుమారు 8 ఏళ్ల క్రితం దటీజ్ మహాలక్ష్మీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి థియేట్రికల్ విడుదల వాయిదా పడుతూ వచ్చింది.దక్షిణాది రీమేక్ రైట్స్ విషయంలో వివాదం చోటు చేసుకోవడంతో దటీజ్ మహాలక్ష్మీ సినిమా థియేటర్ రిలీజ్ కాలేదు.ఇప్పుడు ఈ దటీజ్ మహాలక్ష్మీ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అనే అనుమానంతో మేకర్స్ నేరుగా ఓటీటీలోకి తీసుకురానున్నట్లు సమాచారం.. ఓటీటీ రిలీజ్ కోసం ప్రముఖ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది..త్వరలోనే దటీజ్ మహాలక్ష్మీ ఓటీటీ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!