Site icon NTV Telugu

Tharun Bhascker: అది ప్రకృతి… ఇది ప్రళయం…

Keeda Kola

Keeda Kola

బాలయ్య నటించిన అఖండ మూవీలో జగపతి బాబు… అప్పుడే పుట్టిన పిల్లలకి ఎలివేషన్ ఇస్తూ “వీడు ప్రకృతి, వీడు ప్రళయం” అంటాడు. సరిగ్గా ఇలాంటి మాటనే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి వచ్చింది. తన నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ “అది సైలెన్స్, ఇది తుఫాన్” అంటూ ట్వీట్ చేశాడు. తరుణ్ చేసిన ట్వీట్ లో ‘సైలెన్స్’ ఏమో ‘ఈ నగరానికి ఏమయ్యింది’, తుఫాన్ ఏమో ‘కీడా కోలా’ గురించి. ఈ నగరానికి ఏమైంది సినిమా అసలు ఎవరు ఊహించని హిట్ కొట్టింది, మోడరన్ ఎరా క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ఈ మూవీ ఎంతోమంది యూత్ కి చాలా ఇష్టం. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో, కమల్ హాసన్’, బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్, తాగుదాం, నాగుల పంచమికి సెలవు, డెవలప్, రాహు కాలంలో పుట్టి ఉంటారా నేను లాంటి డైలాగ్స్ ని యూత్ విపరీతంగా వాడుతున్నారు.

ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటే, దర్శకుడు తరుణ్ భాస్కర్ మాత్రం ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ ని హోల్డ్ చేసి ‘కీడా కోలా’ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా గ్రాండ్ లాంచ్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఈ మూవీ గురించి అప్డేట్ ఇస్తూ తరుణ్ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా క్యాచీగా ఉంది. తాగుదాం, గోవా పోదాం అనే సింగల్ వర్డ్స్ ని ఈ నగరానికి ఏమైంది సినిమాలో వాడిన తరుణ్ భాస్కర్ ఈసారి కీడా కోలా సినిమాలో ‘సీన్ అయితది’ అనే పదాన్ని వాడినట్లు ఉన్నాడు. మరి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీతో తరుణ్ భాస్కర్ ఆడియన్స్ ని ఎంత ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.

https://twitter.com/TharunBhasckerD/status/1614143958581669889

Exit mobile version