Site icon NTV Telugu

Aishwarya Sarja: స్టార్ హీరో కూతురుతో కమెడియన్ కొడుకు పెళ్లి.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది

Arjun Sarja Daughter Marria

Arjun Sarja Daughter Marria

Aishwarya Arjun Marriage News: బాలీవుడ్‌ సహా టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండగా, ఇప్పుడు కోలీవుడ్ కూడా సినీ తారల పెళ్లికి సిద్ధమైంది. స్టార్ హీరో అర్జున్ సర్జా పెద్ద కుమార్తె ఐశ్వర్య సర్జా, తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని పెళ్లాడబోతున్నారు. ఈ విషయం ఇప్పటి దాకా ఒక ప్రచారమే కాగా ఇప్పుడు తన కుమారుడు, యువ నటుడు ఉమాపతితో ఆమె పెళ్లి కుదిరిందని తంబి రామయ్య తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ఐశ్వర్య, ఉమాపతి పెళ్లి వార్త నిజమేనని పేర్కొన్న ఆయన హీరో అర్జున్‌ హోస్ట్ గా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి కంటిస్టెంట్‌గా పాల్గొన్నాడని, అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పరిచయాలు ఏర్పడ్డాయని అన్నారు.

Chiranjeevi: మాస్ డైరెక్టర్ ‘కథ’ ఓకే చేసిన చిరంజీవి.. ఇక రచ్చ రచ్చే?

ఈ క్రమంలోనే ఐశ్వర్య అంటే తనకు ఇష్టమని ఉమాపతి మాతో చెప్పాడని, ఈ క్రమంలో రెండు కుటుంబాల పెద్దలు ఇటీవల కలిసి పెళ్లి గురించి మాట్లాడుకున్నామని, త్వరలోనే పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్‌ చేయాలనుకుంటున్నామని అన్నారు. నవంబర్‌ 8న ఉమాపతి పుట్టినరోజు నాడు పెళ్లి డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని తంబి రామయ్య వెల్లడించారు. ఇక వచ్చే ఏడాది వీరి పెళ్లి ఉండొచ్చని తంబి రామయ్య పేర్కొన్నారు. అర్జున్ గురించి తెలుగు వారెవరికీ పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆయన అనేక తెలుగు సినిమాల్లో కూడా నటించి ఆకట్టుకున్నాడు. ఇక తంబీ రామయ్య కూడా పలు తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి పరిచయమే. ఇక నిజానికి పెళ్లి పీటలు ఎక్కుతున్న ఈ ఐశ్వర్య హీరోయిన్ గా అర్జున్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది, అయితే విశ్వక్ సేన్ తో విభేదాలు నేపథ్యంలో ఆ సినిమా ఆగిపోయింది.

Exit mobile version