యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో తమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తన ఫ్యాన్ మూమెంట్ ను చాటుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ “సర్కారు వారి పాట” మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా సాంగ్స్ షూటింగ్ బార్సిలోనాలో జరుగుతోంది. థమన్ కూడా బార్సిలోనాలో ‘సర్కారు వారి పాట’ టీమ్‌తో కలసి సందడి చేస్తున్నాడు. తమన్ నిన్న రాత్రి ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
Read Also : మోడీకి కృతజ్ఞతలు… దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుపై రజినీకాంత్ స్పందన
తమన్ తన తాజా విమాన ప్రయాణంలో గాలిలో, 37,000 అడుగుల ఎత్తులో ‘వకీల్ సాబ్’ను చూస్తున్న ఒక చిన్న వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మానిటర్‌లో ప్లే అవుతున్న ‘పద పద’ పాటను తమన్ కూడా పాడారు. ‘వకీల్ సాబ్’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రాక్స్ నవంబర్ 16 న విడుదల అవుతాయని వెల్లడించారు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’, ‘అఖండ’ వంటి చిత్రాలకు స్వరాలు సమకూరుస్తున్న తమన్… పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ కోసం కూడా సంగీతం సమకూరుస్తున్నారు.
