Site icon NTV Telugu

రాధేశ్యామ్ కోసం రంగంలోకి థమన్.. ఇక బాక్సులు బద్దలే

ss thaman

ss thaman

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్ .. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. విడుదల తేదీని దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పలు ఇంటర్వ్యూలో చిత్ర బృందం పాల్గొని సినిమా విశేషాలను పంచుకుంటున్నారు.

https://ntvtelugu.com/again-nani-s-key-comments-over-ticket-rates-issue/

ఇక తాజాగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ అప్డేట్ ని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అన్ని భాషల్లో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించనున్నాడు. ఈ మేరకు థమన్ ని సినిమాలోకి ఆహ్వానిస్తున్నట్లు యూవీ క్రియేషన్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అఖండ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన థమన్.. రాధే శ్యామ్ కి బీజీఎమ్ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ట్రైలర్ కి సైతం థమన్ యే మ్యూజిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి అఖండ చిత్రంతో అభిమానులకు పూనకాలు తెప్పించిన థమన్ .. ఈ కూల్ లవ్ స్టోరీ కి ఎలాంటి బీజీఎమ్ ఇవ్వనున్నాడో చూడాలి.

Exit mobile version