Site icon NTV Telugu

Thaman: కడుపు మంట ఉన్నవాళ్లే.. థమన్ స్ట్రాంగ్ కౌంటర్

Thaman

Thaman

Thaman: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న థమన్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే. గుంటూరు కారం చిత్రం నుంచి థమన్ ను తొలగించారని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబుతో థమన్ కు విబేధాలు నెలకొన్నాయని, అందుకే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వార్తల సారాంశం. కాగా ఈ రూమర్ వచ్చి గంట కూడా గడవకముందే థమన్ షాకింగ్ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Thaman: మహేష్ తో గొడవ .. సినిమా నుంచి థమన్ అవుట్..?

” ఇక నుంచి నేను నా స్టూడియో దగ్గర ఒక మజ్జిగ స్టాల్ ప్రారంభిస్తున్నాను. కడుపు మంట లక్షణాలతో బాధపడే వారికి స్వాగతం. ప్లీజ్ కోలుకోండి. దయచేసి నా సమయాన్ని వృధా చేయకండి.. నాకు చాలా పనులు ఉన్నాయి. గుడ్ నైట్” అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ట్రోలర్స్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడని తెలుస్తోంది. కడుపు మంట ఉన్నవారే ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసారని, వాళ్లకు తనకు ఇచ్చే సలహా ఇది అని గట్టిగా ఇచ్చిపడేశాడు. దీంతో అసలు ఈ విషయం తెలియని వాళ్ళు ఏమైంది బ్రో అని అంటుండగా.. మరికొందరు ట్రోలర్స్ కు సమాధానం చెప్పింది చాలు.. అప్డేట్ ఇచ్చేది ఏమైనా ఉందా..? అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ట్వీట్ తో ఈ రూమర్స్ కు చెక్ పడుతుందో.. లేక మేకర్స్ సైతం స్పందిస్తారో చూడాలి.

Exit mobile version