Site icon NTV Telugu

SS Thaman: నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్.. కానీ దేవునిపై మనసు విరిగింది !

Thaman Speech

Thaman Speech

Thaman Speech at BRO Movie BlockBuster Press Meet: బ్రో సినిమా సక్సెస్ ఫంక్షన్ లో ఆ సినిమాకి సంగీతం అందించిన సంగీత దర్శకుడు ఎస్.థమన్ మాట్లాడుతూ ముందుగా నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు చెబుతూనే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు పనిచేయడానికి కారకులైన ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు. నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్ గారేనని అది అరవింద సమేత సినిమా ముందు ఆ తరువాత తన లైఫ్ చూస్తే అర్ధం అవుతుందని అన్నారు. ఇక సముద్రఖని గారు నాకు 20 ఏళ్ళ ముందు నుంచే తెలుసని, ఆయన మట్టి మనిషి అని అన్నారు.

Sai Dharam tej: వాళ్ల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు!

వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన ఎంత బాగుంటుందో అంత స్వచ్ఛంగా ఉంటామని, ఈ సినిమా వల్ల ఆయనతో నా అనుబంధం మరింత బలపడిందని అన్నారు. దేవుడి మీద రెండు సార్లు కోపం వచ్చింది, పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, సాయి తేజ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు అంత బాధపడ్డానని అన్నారు. సాయి అంటే అంత ఇష్టం, మనసుకి చాలా దగ్గరైన మనిషి అందుకే సాయి తేజ్ సినిమాకి మనసుతో పని చేస్తానని అన్నారు. క్లైమాక్స్ లో నా సంగీతంతో సాయి తేజ్ పై ప్రేమను చూపించానని పేర్కొన్న ఆయన పవన్ కళ్యాణ్ గారిని టైంగా చూస్తూ నేపధ్య సంగీతాన్ని మరింత బాధ్యతతో చేశానని అన్నారు. ఇంత మంచి సినిమాని ఇచ్చిన సముద్రఖని గారికి థాంక్స్ అని అన్నారు.

Exit mobile version