సంచలన సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ తన మ్యూజిక్ ద్వారా సినిమాలకు అద్భుతమైన విజయాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో అఖండ, భీమ్లా నాయక్ చిత్రాలకు ఆయన అందించిన సంగీతం విపరీతమైన ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల విజయానికి అత్యంత ఆకర్షణీయమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఇలాంటి పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను, సీక్రెట్స్ ను వెల్లడించారు. ఇప్పుడు థమన్ సంగీతం అందించిన ‘రాధే శ్యామ్’ మార్చ్ 11న విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమా గతంలో థమన్‌కి వచ్చిన రెండు హిట్‌లకు భిన్నం. ఇదొక అవుట్ అండ్ అవుట్ సాఫ్ట్ లవ్ స్టోరీ. ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఏం చెప్పారో చూద్దాం.
Read Also : నవతరం నాయిక రితూ వర్మ!
థమన్ మాట్లాడుతూ “ప్రతి కథకి కొంత వాల్యూమ్, సౌండ్ ఉంటుంది. సంగీత దర్శకుడు దానిని అనుభూతి చెందాలి. భీమ్లా నాయక్ జానపద, యాక్షన్ శైలిలో అన్ని అసలైన సాధనాలతో వ్యవహరించాలి. అఖండకు భక్తి, ఆవేశం… ఇప్పుడు ‘రాధే శ్యామ్’ సాఫ్ట్…. మృదుత్వంతో ఔన్నత్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే ఇక్కడ అతిపెద్ద సవాలు. గలిగాను. దర్శకుడిని ఆశ్చర్యపరిచిన, ఆనందపరిచిన బీజీఎమ్ తో మొత్తానికి విజువల్, గ్రాండియర్, జర్నీని ప్రభాస్ దృక్కోణం నుండి గ్రహించగలిగాను. ఈ చిత్రం అన్ని విధాలుగా బాహుబలి కంటే తక్కువ కాదు. ప్రేమ జోనర్‌లో ఇది అతిపెద్ద చిత్రం. ఇంటర్వెల్ బ్యాంగ్, కొన్ని ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు హైనెస్‌ని తెస్తాయి” అని థమన్ తెలిపారు.
