పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్ “.మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 28 న ఎంతో గ్రాండ్ గా కాబోతుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ వున్నారు .. ఇటీవలే టీజర్ ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై టీజర్ తోనే భారీగా అంచనాలు పెంచేయగా ఇప్పుడు మ్యూజికల్ గా అలరించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ విషయం పై ఆసక్తికర పోస్ట్ చేసారు.. బ్రో ప్రమోషన్స్ థమన్ కారణంగానే లేట్ అవుతున్నాయి అనే ఆరోపణలు వస్తున్న కారణంగా థమన్ నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ”బ్రో మంత్ వచ్చేసింది.. ఇక నుండి వరుస అప్డేట్స్ ఉంటాయని” ఆయన ప్రామిస్ చేసాడు. దీంతో ఇక బ్రో ట్రీట్ స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.. ఈ సినిమాలో ఇక ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ గా నిర్మిస్తుంది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు.. వారాహి యాత్ర చేస్తూ ఏపీలో చాలా ప్రాంతాలను పర్యటిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈయన నటించిన బ్రో సినిమా విడుదల కూడా ఉండడంతో సినిమా ప్రమోషన్స్ లో పవన్ పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.అలాగే వారాహి యాత్ర పూర్తి కాగానే వెంటనే పవన్ యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న “ఓజి” షూటింగ్ లో పాల్గొంటారు.
