త్వరలో థియేటర్లలోకి రాబోతున్న పెద్ద సినిమాలకు సంబంధించి రోజుకో కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. వాటిలో చాలా వరకు అవాస్తవమే అయినా కూడా అభిమానులను మాత్రం ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం మొత్తం ‘రాధేశ్యామ్’ ఓటిటిలో విడుదలవుతుందని వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఈ చిత్రం ఓటిటిలో విడుదల కానుందని, 500 కోట్ల భారీ డీల్ కుదిరిందని నిన్న ఉదయం నుంచి గాసిప్‌లు వినిపిస్తున్నాయి.
Read Also : రామ్ చరణ్ ఫ్యాన్స్ కు దిల్ రాజు క్రేజీ అప్డేట్
కానీ మేకర్స్ ఆ రూమర్స్ ను కొట్టి పారేశారు. ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే విడుదలవుతుందని వెల్లడించారు. ఈ మేరకు స్ట మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేశారు. “గ్రాండ్ విజువల్స్, గ్రాండ్ సౌండ్, గ్రాండ్ మేకింగ్… మీ అందరితో కలిసి ‘రాధేశ్యామ్’ను థియేటర్లలో చూడబోతున్నాను’ అంటూ థమన్ ట్వీట్ చేయడంతో ‘రాధేశ్యామ్’ రూమర్లకు చెక్ పెట్టినట్టు అయ్యింది. ఇప్పుడు ఈ క్రేజీ రూమర్స్ ను క్లియర్ చేయడానికి మేకర్స్ త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
“రాధే శ్యామ్” ఈ ఏడాది జనవరి 14న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అయితే వార్తల ప్రకారం కొత్త విడుదల తేదీ గురించి చర్చిస్తూ చిత్ర బృందం బిజీగా ఉంది. కన్ఫ్యూజన్ క్లియర్ చేసి మరోసారి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట చిత్రబృందం. అందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
