Site icon NTV Telugu

Sarkaru Vaari paata : కీలక అప్డేట్ ఇచ్చిన తమన్

thaman

Sarkaru Vaari paata సినిమాపై తమన్ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’మూవీకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసి ‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ ఆల్బమ్‌పై భారీ హైప్‌ని నెలకొల్పిన తమన్ తాజాగా సినిమా నేపథ్య సంగీతంపై పని చేయడం ప్రారంభించాడు. తమన్ తన వర్క్‌స్పేస్ నుండి క్లిప్‌ను షేర్ చేసి ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. “ది మైటీ స్కోర్ #BGM #SVPBGM వర్క్స్ #SarkaruVaaripaataBgm స్టార్ట్స్ ఇది బ్లాక్ బస్టర్ జర్నీ #SuperStarShining” అని తమన్ ట్వీట్ చేశాడు. ఇక మొదటి రెండు సింగిల్స్ ‘కళావతి’, ‘పెన్నీ సాంగ్’కు మంచి వ్యూస్ వచ్చిన విషయం తెలిసిందే.

Read Also : Ajay Devagan Birthday: ధనా ధన్… అజయ్ దేవగన్

మరోవైపు సినిమా ఇప్పటికే 95 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుందని, త్వరలోనే సినిమా నుంచి మరో సాంగ్, మిగతా అప్డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. వేసవిలో విడుదల కానున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మే 12న విడుదలకు సిద్ధమవుతోంది.

Exit mobile version