NTV Telugu Site icon

Bheemla Nayak : థియేటర్లో తమన్ రచ్చ… వీడియో వైరల్

Thaman

Thaman

ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకులను, ముఖ్యంగా మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం మొత్తం విజయోత్సవాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘భీమ్లా నాయక్’ మేనియా కొనసాగుతోంది. అయితే తాజాగా తమన్ సినిమాను ఎంజాయ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో థియేటర్ లో ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రదర్శితం అవుతుండగా, తమన్ స్టేజి పై ఎక్కి ‘లాలా భీంలా’ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

Read Also : NBK107 : కన్నడ సినిమా కాపీనా… క్లారిటీ ఇచ్చిన మేకర్స్

ఇక పవన్ కళ్యాణ్, రానా కలిసిన నటించిన “భీమ్లా నాయక్”కు సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా, త్రివిక్రమ్ మరోసారి మాటల గారడీ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లారు. మొత్తానికి ‘భీమ్లా నాయక్’ టాలీవుడ్ లో తుఫాన్ సృష్టిస్తున్నాడు. మరోవైపు ‘భీమ్లా నాయక్’ బాక్స్ ను కూడా షేక్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.