Site icon NTV Telugu

Thaman: బాలయ్య మత్తు నుంచి బయటకి వచ్చి… గుంటూరు కారం ఘాటు చూపించు

Thaman

Thaman

థమన్ ఏ హీరోకి మ్యూజిక్ ఇచ్చినా అది సినిమాకి హెల్ప్ అవుతుంది, ఆ హీరోకి సూపర్ ఆల్బమ్ అవుతుంది. ఒక్క బాలయ్యకి మాత్రమే థమన్ మ్యూజిక్ ఇస్తే అదో సెన్సేషన్ అవుతుంది. అఖండ నుంచి స్టార్ట్ అయిన ఈ మాస్ కాంబినేషన్ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి పూనకాలు తెప్పించింది. భమ్ అఖండ అంటూ థియేటర్ అంతా ఊగిపోయింది అంటే థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అఘోర గెటప్ లో బాలయ్య కనిపించిన ప్రతిసారీ డ్యూటీ ఎక్కిన థమన్… బాక్సులు బద్దలయ్యే మ్యూజిక్ కొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అఘోరా శివునిగా మారగానే కొన్ని క్షణాల పాటు థియేటర్స్ ని శివాలయాలల్లా మార్చేశాడు థమన్.

అఖండ సినిమా తర్వాత బాలయ్య థమన్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా వీర సింహా రెడ్డి. ఈ మూవీలో సెకండ్ బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ నుంచి ఆయన క్యారెక్టర్ ఎండ్ అయ్యే వరకూ థమన్ నందమూరి అభిమానులు చొక్కాలు చింపుకునే రేంజులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇప్పుడు థమన్ మూడోసారి బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. భగవంత్ కేసరి ఇన్సైడ్ టాక్ ప్రకారం థమన్ ఇంటర్వెల్, క్లైమాక్స్ లో సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడట. దీంతో తమన్ బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ గ్యారెంటీ అనే నమ్మకంలో ఉన్నారు ఫ్యాన్స్. థమన్ కూడా అక్టోబర్ 19న బాలయ్యతో హ్యాట్రిక్ అంటూ ట్వీట్ చేసాడు. ఇది చూసిన నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు కానీ ఘట్టమనేని అభిమానులు మాత్రం బాబు థమన్ ఇక భగవంత్ కేసరి పని అయిపొయింది కదా… మా గుంటూరు కారం డ్యూటీ ఎక్కు, సూపర్ సాంగ్ ఒకటి వదులు అంటూ ట్వీట్ చేస్తున్నారు. మరి తమన్ నుంచి గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుంది? ఏ రేంజులో వస్తుంది అనేది చూడాలి.

Exit mobile version