NTV Telugu Site icon

Thalapathy 67: కాశ్మీర్ వెళ్లిన చిత్ర యూనిట్… ఫిబ్రవరి 3న స్పెషల్ గిఫ్ట్

Thalapathy 67

Thalapathy 67

కోలీవుడ్ లోనే కాదు ఓవరాల్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉందా అంటే ‘దళపతి 67’. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమాగా ‘దళపతి 67’ సెట్స్ పైకి వెళ్లింది. రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ సెట్స్ పైకి సెట్స్ పైకి వెళ్లి చాలా రోజులే అయ్యింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది #Thalapathy67. 7 స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న #Thalapathy67 సినిమా గురించి పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ ని చేసేస్తున్నారు. కోలీవుడ్ హిస్టరీలోనే అంత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ ముంబైలో జరిగే గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందనుంది.

Read Also: Vijay: నా కొడుకుతో నాకు విభేదాలు నిజమే.. ఓపెన్ అయిన విజయ్ తండ్రి

అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న దళపతి 67 మూవీ లేటెస్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్ వెళ్లారు. చెన్నై నుంచి శ్రీనగర్ కి ఫ్లైట్ లో వెళ్లిన చిత్ర యూనిట్, అక్కడ మెయిన్ కాస్ట్ పై ఇంటరెస్టింగ్ ఎపిసోడ్స్ ని షూట్ చెయ్యబోతున్నారు. ఫిబ్రవరి 3న ఒక ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేసి దళపతి 67 సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెంచడానికి లోకేష్ కనగరాజ్ ప్రిపేర్ అవుతున్నాడు.

ఇదిలా ఉంటే ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలని లింక్ చేసి ఒక యూనివర్స్ గా మార్చాడు లోకేష్ కనగారాజ్. #Thalapathy67 సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుందని అంతా భావిస్తున్నారు కానీ చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. మాస్టర్ లాగే దళపతి 67 సినిమా కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. ఇది నిజమో లేక దళపతి 67 కూడా లోకేష్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి.

Read Also: Thalapathy Vijay: మా డబ్బులు కావాలి కానీ మా దగ్గర ప్రమోషన్స్ కి రారు…