Thalapathy Vijay : తలపతి బర్త్ డే ట్రీట్ ‘జన నాయగన్’ కాదు… సర్ప్రైజ్ ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalapathy Vijay : విజయ్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ వెండితెరపైకి రాబోతోంది. అయితే అది ‘ జన నాయగన్’ కాదు, దర్శకుడు అట్లీ దర్శకత్వంలో, తేనండాల్ పిక్చర్స్ 2017లో నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మెర్సల్’. తమిళ సినీ అభిమానులకు ‘మెర్సల్’ కేవలం ఒక సినిమా కాదు. అది తలపతి విజయ్ స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన మైలురాయి. విడుదలై దాదాపు తొమ్మిదేళ్లు కావొస్తున్నా, ఆ చిత్రంలోని సన్నివేశాలు, డైలాగులు, పాటలు, ముఖ్యంగా విజయ్ త్రిపాత్రాభినయం ఇప్పటికీ అభిమానుల మదిలో మెదులతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే చిత్రం మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. తలపతి విజయ్ 52వ పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేక కానుకగా ‘మెర్సల్’ రీ రిలీజ్ అవుతున్న వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
విజయ్ పుట్టినరోజు జూన్ 22న జరగనుండగా, ఆ వేడుకలను మరింత ఘనంగా మార్చేందుకు ‘మెర్సల్’ను జూన్ 19 నుంచే థియేటర్లలో తిరిగి విడుదల చేయనున్నారు. దీంతో అభిమానులకు ఇది ఒక ప్రత్యేక వీకెండ్ ఫెస్టివల్‌గా మారనుంది. సాధారణంగా రీ రిలీజ్లు పరిమిత స్థాయిలో జరుగుతుంటాయి. కానీ ‘మెర్సల్’ విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు వంటి కీలక ప్రాంతాల్లో దాదాపు 100 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. విడుదలై ఎన్నేళ్లు గడిచినా విజయ్ సినిమాలకు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టంగా తెలియజేస్తోంది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం 2017లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. వైద్య రంగంలో జరుగుతున్న అక్రమాలు, సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్యలను కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో చెప్పిన తీరు అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ చిత్రానికి అసలైన బలం విజయ్ పోషించిన మూడు విభిన్న పాత్రలే. ఇంద్రజాలికుడిగా, వైద్యుడిగా, ఆ వైద్యుడి తండ్రిగా ఆయన చూపించిన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో నిత్యా మీనన్, సమంత రూత్ ప్రభు, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీత దర్శకుడు A. R. Rahman అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ మూవీ విడుదల సమయంలో ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, అప్పటి తమిళ సినీ పరిశ్రమలో అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది.
- Tags
- cinema
- Thalapathy Vijay
తాజావార్తలు
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?