Site icon NTV Telugu

Varasudu: అయిదు రోజుల్లో 150 కోట్లు… దిల్ రాజు చెప్పింది నిజమే

Varasudu

Varasudu

దళపతి విజయ్ నటించిన ‘వారిసు/వారసుడు’ సినిమా కోలీవుడ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. జనవరి 11న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీపై దిల్ రాజు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ వారిసు మూవీ కేవలం అయిదు రోజుల్లోనే 150 కోట్లు రాబట్టింది. సంక్రాంతి సీజన్ లో అజిత్ లాంటి స్టార్ హీరోతో క్లాష్ ఉన్న సమయంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో విజయ్ అదిరిపోయే కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. నిజానికి వారిసు మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది, మాస్ హీరోతో ఫ్యామిలీ సినిమా ఎందుకు తీసారు అని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు. దిల్ రాజు మాత్రమే మాస్ హీరోతో ఫ్యామిలీ సినిమా చేస్తే చూడడానికి కొత్తగా ఉంటుంది పైగా ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు అనే లెక్కలు వేశాడు దిల్ రాజు.

దిల్ రాజు లెక్క పర్ఫెక్ట్ గా కుదిరింది, ఆడియన్స్ దిల్ రాజుని కరెక్ట్ అని ప్రూవ్ చేస్తూ వారిసు మూవీపై వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. కోలీవుడ్ లో, ఓవర్సీస్ లో వారిసు మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే సమయానికి 180 కోట్ల బెంచ్ మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ ఉంది. విజయ్ కి అజిత్ తో క్లాష్ పడిన సమయంలో సూపర్ హిట్ ఇచ్చాడు కాబట్టి ద్దిల్ రాజు ఇకపై తమిళనాడులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు లేట్ గా రిలీజ్ అయిన వారిసు డబ్బింగ్ వర్షన్ వారసుడు సినిమా కూడా మంచి కలెక్షన్స్ నే రాబడుతోంది. అయితే చిరు, బాలయ్యల సినిమాలు సాలిడ్ ఫుట్ ఫాల్స్ రాబడుతుండడంతో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాల ఓవర్ ఫ్లోస్ మాత్రమే వారసుడు మూవీకి వెళ్తున్నాయి.

Exit mobile version