Site icon NTV Telugu

Leo: ఒరిజినల్ ట్రైలర్ కన్నా ఓటీటీ ట్రైలరే బాగుంది మావా…

Leo

Leo

విక్రమ్ సినిమాకి ముందు లోకేష్ కనగరాజ్ ఒక మంచి డైరెక్టర్ అంతే… విక్రమ్ సినిమాతో లోకేష్ ఒక్కసారిగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ప్లేస్ సంపాదించాడు. ఖైదీ హిట్ తర్వాత విజయ్ తో మాస్టర్ సినిమా చేసిన లోకేష్, విక్రమ్ హిట్ తర్వాత కూడా విజయ్ తో సినిమా చేసాడు. మాస్టర్ తో యావరేజ్ మూవీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్-విజయ్ కాంబినేషన్ ఈసారి లియో సినిమాతో పాన్ ఇండియా హిట్ ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేసారు. అయితే లోకేష్ మాత్రం ఒక వర్గాన్ని మాత్రమే మెప్పించేలా లియో సినిమాని తెరకెక్కించాడు. రిలీజ్ అయిన మొదటి రోజు మార్నింగ్ షో నుంచి లియో మూవీకి డివైడ్ టాక్ వచ్చేసింది. ప్లే లో లోపాలని ఆడియన్స్ ఇట్టే కనిపెట్టేయడంతో లియో సినిమా లోకేష్ వీక్ వర్క్స్ లో టాప్ లో నిలిచింది. ఏ ఫ్రేమ్ లో చూసినా హ్యూజ్ కాస్టింగ్, భారీ ఖర్చు లియో సినిమా మొత్తం కనిపిస్తాయి. అనిరుధ్ కూడా విక్రమ్, జైలర్ రేంజ్ వర్క్ ని లియో సినిమాకి ఇవ్వలేదనే చెప్పాలి. మ్యూజిక్ బాగానే ఉంది కానీ అనిరుధ్ రేంజ్ కాదు, కథ బాగానే ఉంది కానీ లోకేష్ రేంజ్ కాదు.

ఓవరాల్ గా లియో సినిమాలో కాస్త చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో విజయ్ లియో సినిమాలో నటించినంతగా మరే సినిమాలో యాక్ట్ చేయలేదు. అందుకే విజయ్ ఫ్యాన్స్ కి లియో సినిమా చాలా బాగా ఎక్కింది. సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ కూడా సాలిడ్ గా వచ్చాయి. 500 కోట్లకి రాబట్టిందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్న మాట, ఇంకో వర్షన్ లో ఈ కలెక్షన్స్ ఫేక్ అనే వాళ్లు కూడా ఉన్నారు. ఏది ఏమైనా తెలుగు వరకూ లియో సినిమా హిట్ కిందే లెక్క. ఇక థియేట్రికల్ రన్ కంప్లీట్ అవ్వడంతో లియో సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వడానికి రెడీ అవుతోంది. 24 నవంబర్ నుంచి లియో సినిమా ప్రీమియర్ కానుంది. మరో మూడు రోజుల్లో రిలీజ్ అవుతుండడంతో నెట్ ఫ్లిక్స్ లియో ఓటీటీ ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ఒరిజినల్ ట్రైలర్ కన్నా ఈ ఓటీటీ వెర్షన్ ట్రైలర్ అట్రాక్టివ్ గా ఉండడం విశేషం. మరి నెల రోజుల్లోనే ఓటీటీలోకి ప్రత్యక్షం అవ్వనున్న లియో సినిమా డిజిటల్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version