NTV Telugu Site icon

Leo Audio Launch: భారీ ఎత్తున ‘లియో’ ఈవెంట్‌!

Leo

Leo

కార్తితో కలిసి ఖైదీ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు లోకేష్‌ కనగరాజ్. ఇదే జోష్‌లో విజయ్‌తో ‘మాస్టర్’ సినిమా చేశాడు కానీ ఈ మూవీ విజయ్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. ఆశించిన స్థాయిలో మాస్టర్ మెప్పించలేకపోయింది. అందుకే.. ఆ లోటును తీర్చడానికి ఇప్పుడు ‘లియో’ సినిమాతో రాబోతున్నాడు లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ వంటి సాలిడ్ హిట్ కొట్టిన లోకేష్… విజయ్‌తో అంతకుమించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన లియో ఫస్ట్ సాంగ్, అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అంచనాలను భారీగా పెంచేసింది. రీసెంట్‌గా బ్యాక్ టు బ్యాక్ లియో పోస్టర్స్‌ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం లియో పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Read Also: Naga Chaitanya 23: సాయి పల్లవి వచ్చేసింది… గీత ఆర్ట్స్ 2 అఫీషియల్ అనౌన్స్మెంట్

ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో లియో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆడియో లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 30న చెన్నైలోని నెహ్రు ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాట్టు తెలుస్తోంది. రేపో మాపో ఈ ఈవెంట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఈ ఈవెంట్‌కు విజయ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలి రానున్నారు. ఇక త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ కీలక పాత్రలు చేస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also: Neha Shetty: చిరునవ్వుతో చంపేస్తున్న నేహా శెట్టి