Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడంతో ఆయన క్రేజ్ ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ఈ పొలిటికల్ సునామీ ప్రభావం ఇప్పుడు బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ నటించిన ఆఖరి చిత్రం కావడం.. ఇకపై ఆయన వెండితెరపై కనిపించరు అనే భావన ఉండటంతో ‘జననాయగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు హక్కుల వ్యాపారం ఇప్పుడు హాట్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో దళపతికి ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుత పొలిటికల్ వేవ్ ని క్యాష్ చేసుకునేందుకు ‘జననాయగన్’ నిర్మాతలు తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా ₹35 కోట్లు కోట్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మన దగ్గర బయ్యర్లు మాత్రం ₹15 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారట.
₹15 నుంచి ₹20 కోట్ల రేంజ్ అయితేనే బయ్యర్లకు సేఫ్ జోన్. అలా కాకుండా నిర్మాతలు అడిగినంత పెట్టి భారీ ధరకు కొనుగోలు చేస్తే మాత్రం కచ్చితంగా పెద్ద రిస్క్ చేసినట్లే. ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో వస్తే తప్ప బయ్యర్లు గట్టెక్కడం కష్టం. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే.. ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ కి అఫీషియల్ రీమేక్ అని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మన తెలుగు ఆడియన్స్ ఇప్పటికే చూసేసిన కథ కావడంతో.. కేవలం దళపతి ఆఖరి చిత్రం అనే ఎమోషన్, ఆయన కొత్త పొలిటికల్ ఇమేజ్ మాత్రమే ఈ సినిమాని థియేటర్లలో నిలబెట్టాలి. మరి ట్రేడ్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ భారీ డీల్ చివరికి ఏ ధరకు క్లోజ్ అవుతుందో చూడాలి!
Also Read
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
- Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్‌లో విజయ్ దేవరకొండ సినిమా?
- Chiranjeevi : నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేయబోతున్న 'చిరంజీవీస్ మెగావర్స్'!
- Janhvi Kapoor: ‘సౌత్‌లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
తాజావార్తలు
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
-
Women’s Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?