Vijay: వయస్సు కనపడకుండా చేయడానికి రూ. 6 కోట్లా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది వారసుడు సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చినా.. లియో సినిమా మాత్రం మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. తెలుగు లో మిక్స్డ్ టాక్ ను అందుకున్నా.. తమిళ్ లో మాత్రం హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతం విజయ్.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో విజయ్ తో ఒక మంచి సినిమా తీసి హిట్ అందుకోవాలనుకుంటున్నాడు డైరెక్టర్. అంతే కాకుండా ఈ సినిమానే విజయ్ చివరి సినిమా అని టాక్ నడుస్తోంది. ఈ సినిమా తరువాత విజయ్.. సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి.. రాజకీయ ప్రవేశం చేయనున్నాడు. దీంతో ఈ చిత్రంపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమాలో విజయ్ విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడట. ఇందుకోసం వెంకట్ ప్రభు.. కొత్త టెక్నాలిజీని వాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హీరోలు యుక్తవయస్సులో ఉన్నప్పుడు కథలో కుర్ర హీరోలను చూపించకుండా.. హీరోలకే మేకప్ వేసి.. తక్కువ వయస్సు ఉన్నవారిలా చూపిస్తున్నారు. ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు లో రవితేజ అలానే కనిపించాడు. అయితే.. విజయ్ కు కూడా అలాంటి మేకప్ వేయాలని ట్రై చేసినా.. వర్క్ అవుట్ అవ్వదని తెలిసి.. కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నాడట వెంకట్ ప్రభు.. దీనికోసం దాదాపు రూ. 6 కోట్లు ఖర్చుపెడుతున్నారట. విజయ్ 19 ఏళ్ల వయస్సులో ఉన్నట్లు కనిపించడం కోసం.. వెంకట్ ప్రభు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!