Site icon NTV Telugu

Thalapathy 68: లియో జోష్ తగ్గక ముందే ఫ్యాన్స్ కి సాలిడ్ గిఫ్ట్…

Thalapathy 68

Thalapathy 68

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేస్తున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి సంబందించిన వీడియోని మేకర్స్ రిలీజ్ చేసారు. కాస్ట్ అండ్ క్రూ ని రివీల్ చేస్తూ ఈ పూజా కార్యక్రమాల వీడియోని రిలీజ్ చేసారు. లియో నుంచి ఇంకా బయటకి రాని విజయ్ ఫ్యాన్స్ కి దళపతి 68 ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ రావడం కిక్ ఇచ్చింది. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దళపతి 68 సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా… జయరామ్, ప్రభుదేవా, యోగిబాబు, ప్రశాంత్, స్నేహ, లైలా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Read Also: Bigg Boss Subhashree: బంఫర్ ఆఫర్ ను కొట్టేసిన బిగ్‌ బాస్‌ శుభశ్రీ.. ఆ స్టార్ సినిమాలో ఛాన్స్..

ఎప్పటిలాగే వెంకట్ ప్రభు మ్యూజిక్ భద్యతలని యువన్ శంకర్ రాజాకి అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, థీమ్ మ్యూజిక్ ఇవ్వడంలో యువన్ స్టయిలే వేరు.  క్రియేటివ్ గా కథ చెప్పడం, కథనంలో కావాల్సినన్ని ట్విస్ట్ లు పెట్టడం వెంకట్ ప్రభు స్టైల్ అఫ్ ఫిల్మ్ మేకింగ్. అజిత్ తో మంగాత్తా సినిమా చేసిన తర్వాత వెంకట్ ప్రభు ఫేట్ పూర్తిగా మారిపోయింది. అజిత్ ని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చూపించి మంగాత్తా సినిమాతో సూపర్ హిట్ కొట్టినప్పటి నుంచి వెంకట్ ప్రభుకి తమిళ ఆడియన్స్ లో క్రేజ్ పెరిగింది. వెంకట్ ప్రభు పాలిటిక్స్, వెంకట్ ప్రభు రీయూనియన్, వెంకట్ ప్రభు గేమ్ లాగా ఈసారి ఎలాంటి కొటేషన్ తో సినిమా చేస్తాడు అనేది చూడాలి.

Exit mobile version