Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Tg Vishwa Prasad Interview For Mirai Teja Sajjas Pan India Visual Wonder To Release On Sept 12

TG Vishwaprasad : ‘మిరాయ్‌’ ఫాంటసీ విజువల్ వండర్..అయినా అందుకే టికెట్ రేట్లు పెంచలేదు

Published Date :September 9, 2025 , 5:22 pm
By Bhargav Chaganti
TG Vishwaprasad : ‘మిరాయ్‌’ ఫాంటసీ విజువల్ వండర్..అయినా అందుకే టికెట్ రేట్లు పెంచలేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మిరాయ్‌ మీకు ప్రొఫెషనల్ గా ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది?
-నేను 2017 లో ఇండస్ట్రీలోకి వచ్చాను. 2018 నుంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రతి ఏడాది మాకు మంచి సక్సెస్ లు ఉంటాయి. కానీ 2024 డిసప్పాయింట్ చేసింది, ఇప్పుడు మిరాయ్‌తో కం బ్యాక్ ఇస్తామని పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. మిరాయ్‌ మార్కెట్ లెక్కలు వేసుకోకుండా ఒక ఎక్స్‌ట్రార్డినరీ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేశాం. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటికీ తేజ హనుమాన్ ఇంకా రాలేదు. మేము ప్రోడక్ట్ ని బిలీవ్ చేసాము. ఇందులో దాదాపు ఒక పది లార్జర్ ఎపిసోడ్లు ఉంటాయి. మంచి కథ, మంచి మ్యూజిక్, గ్రేట్ లొకేషన్స్, అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

ఈ కథ మీరు చేయడానికి కారణం?
-నాకు చిన్నప్పుడు చందమామ కథలు, అమరచిత్ర కథలు అంటే చాలా ఇష్టం. ఆ కథలన్నీ కూడా మన రామాయణ మహాభారత ఇతిహాసాలకి కనెక్ట్ గా ఉంటాయి. మిరాయ్ కూడా అద్భుతమైన ఫాంటసీ అడ్వెంచర్. చరిత్రతో పాటు ఫిక్షన్ కూడా బ్లెండ్ అయి ఉంది. కార్తీక్ కథ చెప్పగానే చాలా నచ్చింది. అశోకుడు మొత్తం జ్ఞానాన్ని 9 పుస్తకాల్లో నిక్షిప్తం చేశాడు. అందులో వాటి రక్షణ ఎనిమిది మంది యోధులకు ఇస్తాడు. ఒక పుస్తకం మాత్రం ఒక ఆశ్రమానికి ఇస్తాడు. ఆ పుస్తకాల ప్రాధాన్యత ఏమిటి? వాటి గురించి హీరో, విలన్ ఎలాంటి పోరాటం చేశారనే అద్భుతంగా వుంటుంది. తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. థాయిలాండ్ లో యాక్షన్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అలాగే మనోజ్ గారు పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. చాలా అనుభవం వున్న నటీనటులు ఇందులో చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు. మిరాయి ఒక తల్లి సంకల్పంతో ముడిపడిన కథ, ఆ సంకల్పం ఏమిటనే తెరపై అద్భుతంగా వచ్చింది. కార్తీక్ బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్. తనకి లోకేషన్ లో ఏం కావాలి? సెట్లో ఏం ఉండాలి, ఏవి గ్రాఫిక్స్ లో ఉండాలనే ఫుల్ క్లారిటీ ఉంది. ఈ సినిమాలో లోకేషన్స్, గ్రాఫిక్స్ ఆడియన్స్ కి చాలా కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.

ఫాంటసీలో బిలవబులిటీ చాలా ముఖ్యం కదా.. ఇందులో ఎలా కనెక్ట్ చేశారు?
-ఈ సినిమాలో ప్రతి ఎలిమెంటు, క్యారెక్టర్ కి ఒక పర్పస్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ నేచురల్ గా వుంటుంది. ప్రతి సీక్వెన్స్ కి చాలా అద్భుతమైన కనెక్షన్ ఉంటుంది. డైరెక్టర్ కార్తీక్ ఫాంటసీ స్టోరీ టెల్లింగ్, మంచి కనెక్షన్ తో సినిమాని తీశాడు.

కరణ్ జోహార్ గారు ఈ సినిమాని నార్త్ లో రిలీజ్ చేయడం ఎలా అనిపించింది?
-కరణ్ జోహార్ సినిమా కంటెంట్ ని చూశారు. వాళ్లకు చాలా నచ్చింది. ఆయన నార్త్ లో రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. శ్లోకతో కలసి యూఎస్ లో రిలీజ్ చేస్తున్నాము. కర్ణాటకలో హోంబాలే, కేరళలో గోకులం తమిళనాడులో ఏ జి ఎస్ రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మిరాయ్ కంటెంట్ కి అన్ని వైపుల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. రిలీజ్ కి ముందు సినిమాని చాలా గొప్పగా యాక్సెప్ట్ చేశారు.

విఎఫ్ఎక్స్ ఇన్ హౌస్ లో చేశారు కదా.. అలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటి?
కంట్రోల్ ఉంటుంది. గ్రాఫిక్స్ బయటికి ఇస్తే చాలా ఇష్యూస్ ఉంటాయి. చివరికి వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి. మనం ఇన్ హౌస్ చేస్తే మనకి కంట్రోల్ దొరుకుతుంది.

ప్రీమియర్స్ వేసే ఆలోచన ఉందా?
-డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడాలి. ఈ సినిమా స్కేల్, సైజ్ కి టికెట్స్ రేట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ సినిమా చూస్తే మీకు 300 కోట్లు ఖర్చు చేసిన సినిమా అనిపిస్తుంది. కానీ మేము టికెట్ రేట్స్ పెంచాలని అనుకోవడం లేదు. జనరల్ గా ఉండే టికెట్ ధరలో పెట్టాం. ఈ సినిమాని ఎంతమంది చూశారు అనే దాని మీదే మా దృష్టి ఉంది. ఫ్యామిలీస్ పిల్లలు కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాము.

ఈ సినిమాకి మీరు చాలా ఇన్వాల్వ్ చేసినట్టుగా అనిపిస్తోంది?
-నేను డీప్ గా ఇన్వాల్వ్ అయిన చేసిన సినిమా ఇదే. బిగ్ కాన్వాస్ ఉన్న సినిమా ఇది. గత ఏడాదిన్నరగా ఈ సినిమాతోనే ఇంకా ఎక్కువగా ట్రావెల్ అవుతున్నాను. బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసిన సినిమా ఇది.

సినిమా కోసం మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏమిటి?
-చాలా కాంప్లెక్స్ గా అనిపించిన ఒక సీక్వెన్స్ ఉంది. ఇందులో ఒక సంపాతి అనే పక్షి ఉంటుంది. దీనికోసం ఒక చాలా పెద్ద ఫ్లోర్ ఉన్న సెట్ కావాల్సి వచ్చింది. రాజాసాబ్ వన్ అఫ్ ది లార్జెస్ట్ ఫిలిం షూటింగ్ ఫ్లోర్. మిరాయ్ కోసం చేసిన సీక్వెన్స్ సెకండ్ లార్జెస్ట్ ఫ్లోర్. 30000 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. అందులో ఒక సెట్ వేసాం. ఆ పక్షిని యానిమాట్రిక్స్ టెక్నాలజీతో చేయడం జరిగింది. ఇది చాలా కాంప్లెక్స్ వర్క్. పక్షితో ఇంతలా హ్యూమన్ ఇంటరాక్షన్ వున్న సినిమా ఇప్పటికీ రాలేదని భావిస్తున్నాను.

ట్రైలర్ లో లార్డ్ శ్రీరామ కనిపించడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది?
-ఈ సినిమాలో ప్రతి ఎలిమెంట్ కి మంచి కనెక్షన్ వుంటుంది. శ్రీరాముల వారు కనిపించడానికి మంచి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. అది థియేటర్స్ లో చాలా మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

రాజాసాబ్ గురించి?
-రాజాసాబ్ జనవరి 9న వస్తుంది. కాంతార2 తో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. ప్రభాస్ గారికి బర్త్ డే కి ఫస్ట్ సింగిల్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం.

కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి?
తెలుసు కదా నెక్స్ట్ మంత్ వస్తుంది. తర్వాత మోగ్లీ ఉంటుంది. లావణ్య త్రిపాఠి గారితో ఒక థ్రిల్లర్ చేస్తున్నాం, సునీల్ గారితో కూడా ఒక సినిమా చేస్తున్నాం. అవి కూడా ఈ ఏడాదిలోనే వస్తాయి. గూడచారి2, గరివిడి లక్ష్మి, అలాగే కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నాం. దాదాపు 12 సినిమాలు 2026- 2027 మధ్య మా సంస్థ నుంచి విడుదలవుతాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indian superhero film
  • Karthik Ghattamaneni
  • Mirai movie
  • pan-India film
  • People Media Factory

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions