Site icon NTV Telugu

TG Vishwa Prasad: అంబటి రాంబాబువి గాలి మాటలు.. నేను సీరియస్ గా తీసుకుంటే ఎలా బుద్ది చెప్పాలో తెలుసు

Tg Vishwa Prasad Ambati Rambabu

Tg Vishwa Prasad Ambati Rambabu

TG Vishwa Prasad Crucial Comments on Ambati Rambabu: బ్రో సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీ ఈ శుక్రవారం నాడు రిలీజ్ అయి అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్‌ప్లే అందించగా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అయితే బ్రో సినిమాలో కమెడియన్ పృథ్వీ చేసిన శ్యాంబాబు పాత్ర అంబ‌టిరాంబాబును పోలి ఉందంటూ అంబ‌టి స్వయంగా ఫీల్ అవుతున్నారు. ఇక త‌నను కించ‌ప‌ర‌చాల‌నే బ్రో సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ్యాంబాబు క్యారెక్ట‌ర్‌ను పెట్టించారని ఆరోపిస్తున్న అంబ‌టి రాంబాబు టీడీపీ నాయ‌కులు ఇచ్చిన డ‌బ్బుతోనే విశ్వ‌ప్ర‌సాద్ బ్రో సినిమా తీశాడంటూ అంబ‌టి రాంబాబు అంటున్నారు. అంతేకాదు ఆయనకు అమెరికా నుంచి నల్లధనంతో ఈ సినిమాను నిర్మించారని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాదు ఇక‌పై ఇలాంటి సినిమాలు తీస్తే ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పాల్సివ‌స్తుంద‌ని త్రివిక్ర‌మ్ కి సైతం ఆయన వార్నింగ్ ఇచ్చారు.

Ambati Rambabu: పవన్ నన్ను గోకాడు కాబట్టే..!

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో బ్రో ప్రొడ్యూస‌ర్ విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రో మూవీతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌పై ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు చేసిన కామెంట్స్‌ను గాలి మాట‌లుగా పరిగణిస్తున్నా అని ప్రొడ్యూస‌ర్ విశ్వ‌ప్ర‌సాద్ పేర్కొన్నాడు. ఇక ఈ విషయాన్ని కనుక నేను సీరియస్ గా తీసుకుంటే, అలాంటి బాధ్యతారహిత, అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేసినందుకు అతనికి ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసని ఎందుకంటే నా లీగల్ టీం చాలా స్ట్రాంగ్ అని టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. త‌న సొంత డ‌బ్బుతోనే ఈ సినిమా తీశాన‌ని, తనకు ఐటీ ఫర్మ్ నుంచి డబ్బు వస్తుందని విశ్వ‌ప్ర‌సాద్ పేర్కొన్నారు. ఈ సినిమా మేకింగ్‌లో తాను ఎలాంటి త‌ప్పులు చేయ‌లేద‌ని, రాజ‌కీయం కోస‌మే అంబ‌టి ఇలా చేస్తున్నారని తనకు అనిపిస్తోందని ఆయన అన్నారు. అంబ‌టి రాంబాబు కామెంట్స్ వ‌ల్ల త‌మ సినిమాకు ప‌బ్లిసిటీ పెరుగుతోంద‌ని, అందువ‌ల్లే అత‌డి కామెంట్స్‌ను తాను నెగెటివ్‌గా తీసుకోవ‌డం లేద‌ని కూడా ఆయన కామెంట్ చేశారు.

Exit mobile version