Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికల్లో (బై ఎలక్షన్స్) విజయం సాధించిన నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించింది. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించగా, ప్రముఖ నిర్మాతలు TG విశ్వప్రసాద్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ.. “యూనియన్‌లో పక్కాగా కార్యవర్గం ఉండాలనే బై-లాస్ నిబంధనలకు లోబడే ఈ ఉప ఎన్నికలు నిర్వహించాం. ఎవరినీ ఎదిరించడానికి లేదా పోటీగా ఈ నిర్ణయం తీసుకోలేదు. గెలిచిన ప్రతినిధులు షూటింగ్స్ లేని సమయంలో అందుబాటులో ఉంటూ, డాన్సర్స్ సంక్షేమానికి, యూనియన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
Also Read
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
- Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
అసోసియేషన్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టిన తడివేలు (ఇశ్రాయేలు పిట్ట) మాట్లాడుతూ.. “మా యూనియన్ చరిత్రలోనే సుమలత గారిలాంటి దృఢమైన నాయకురాలిని, అధ్యక్షురాలిని చూడలేదు. డాన్సర్ల హక్కుల కోసం, సంక్షేమం కోసం ఆమె నిలబడుతున్న తీరు అభినందనీయం. నిజంగా ఆమె మా డాన్సర్స్ పాలిట ఇందిరా గాంధీ లాంటివారు” అని ప్రశంసించారు.
నూతన ప్రధాన కార్యదర్శి జి. బాలకృష్ణ మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి గారికి గానీ, ఫెడరేషన్‌కు గానీ మేము ఎప్పుడూ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు. కానీ కొన్ని మీడియా ఛానెళ్లు అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నాయి. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇచ్చిన ₹40 లక్షలు, జానీ మాస్టర్ ఇచ్చిన ₹18 లక్షల నిధులను త్వరలోనే సభ్యుల బీమా (ఇన్స్యూరెన్స్) రూపంలో కేటాయిస్తాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ ఫెడరేషన్ మద్దతు కావాలని కోరుతున్నాం. మేము బై-లాస్ ప్రకారమే నడుచుకుంటున్నాం” అని స్పష్టం చేశారు.
ప్రముఖ నిర్మాత TG విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “నిర్మాతలుగా మేము ఇచ్చే వేతనాలు మధ్యవర్తులకు వెళ్లకుండా నేరుగా డాన్సర్లకే అందాలని సుమలత గారు చేస్తున్న పోరాటం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఆమెకు మద్దతుగా ఇక్కడికి వచ్చాను. త్వరలో నా నిర్మాణంలో రాబోయే సినిమాల్లో 100 శాతం హైదరాబాద్ డాన్సర్లకే అవకాశం కల్పిస్తాం” అని హామీ ఇచ్చారు.
దీనికి తోడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందిస్తూ, సాధ్యమైనంత వరకు ముంబై డాన్సర్లను పక్కన పెట్టి మన స్థానిక తెలుగు డాన్సర్లకే ప్రాధాన్యమిస్తానని, తన పాటల్లో లోకల్ టాలెంట్‌కే మొదటి పీట వేస్తానని వెల్లడించారు.
అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..