Site icon NTV Telugu

తమిళ హీరోపై రెడ్ కార్డు బ్యాన్ తొలగింపు

TFPC Removes Red Card Ban On Simbu

తమిళ హీరో శింబుకు ఊరట కల్పించింది నిర్మాతల మండలి. ఈ హీరో కెరీర్ ప్రారంభం నుండి వివాదాలలో చిక్కుకుంటూనే ఉన్నాడు. కొంతమంది నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో ఆయన గొడవ చివరికి తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వరకూ చేరుకొని అక్కడ నుండి రెడ్ కార్డ్ నిషేధానికి దారి తీసింది. గతంలో శింబు ప్రధాన పాత్రలో “అన్బాధవన్ అసరదావన్ అడంగాదవన్‌” అనే సినిమా సమయంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాను తెరకెక్కించిన నిర్మాత మైఖేల్ రాయప్పన్ శింబు ఈ సినిమాకు సరిగ్గా సహకరించకపోవడం వల్లే రూ.2 కోట్లు నష్టపోయాను అంటూ తమిళ నిర్మాతల మండలిలో పిర్యాదు చేశారు. నిర్మాతకు శింబు నష్టపరిహారం చెల్లించాలంటూ అక్కడి పెద్దలు తేల్చారు, కానీ శింబు దానిని పట్టించుకోలేదు. దాంతో ఆయనపై రెడ్ కార్డు బ్యాన్ విధించారు. అయితే ఈ వ్యవహారంపై రీసెంట్ గా శింబు తల్లి లేఖ రాయడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో తాజాగా శింబుపై రెడ్ కార్డు బ్యాన్ ను ఎత్తేశారు.

Read Also : రిపబ్లిక్ : ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ రిలీజ్

ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) కూడా ఇప్పుడు ఈ హీరో నెక్స్ట్ చిత్రాల షూటింగ్‌లకు సహకరిస్తుంది. శింబు ప్రస్తుతం వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రెండు సినిమాల షూటింగ్‌లో ఉన్నాడు. అవి గౌతమ్ మీనన్ “వెందు తానింధుడు కాదు”, గోకుల్ “కరోనా కుమార్”. పొలిటికల్ థ్రిల్లర్ ‘మానాడు’ షూటింగ్‌ను శింబు ఇటీవలే పూర్తి చేశాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో “ముఫ్తీ”కి అధికారిక రీమేక్ అయిన “పాథూ తాలా” షూటింగ్ ప్రారంభించనున్నాడు. ఇక తాజాగా శింబుపై రెడ్ కార్డ్ నిషేధం ఎత్తివేత వార్త విని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు శింబు అన్ని సినిమాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదలవుతాయని ఆశిస్తున్నారు.

Exit mobile version