Site icon NTV Telugu

Telusukada: ఫస్ట్ ఛాయిస్ నితిన్.. ‘తెలుసు కదా’ వెనుకున్న షాకింగ్ స్టోరీ..!

Nithin Sidhu Jonnalagada

Nithin Sidhu Jonnalagada

దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదలైన “తెలుసుకదా” మంచి టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో అద్భుతంగా ఆడుతూ, సిద్దుకు తన కెరీర్‌లో మరో మైలురాయి సక్సెస్‌ని అందించింది. ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా అరంగేట్రం చేయగా.. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా సక్సెస్ మీట్ సందర్భంగా సిద్దు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Janhvi Kapoor: కేవలం గ్లామర్ కాదు, పర్ఫార్మెన్స్ కూడా – కొత్త ట్రాక్‌లో జాన్వీ కపూర్!

ఆయన చెప్పిన ప్రకారం.. “తెలుసు కదా” సినిమాలో ఫస్ట్ ఛాన్స్ నాకేం రాలేదు. ఈ కథ మొదట నితిన్‌గారికి వెళ్లింది. కథ మొత్తం విన్న నితిన్, రాత్రి నాకు ఫోన్ చేసి – ‘ఇదో మంచి కథ ఉంది, నీకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. నువ్వు విను’ అని చెప్పారు. అలా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ సినిమా అవకాశానికి నీరజ కంటే ముందు నితిన్‌గారికే థాంక్స్ చెప్పాలి” అని సిద్దు చెప్పారు. అంటే “తెలుసు కదా”లో హీరోగా మొదట నితిన్ ఉండాల్సింది! ఆయన ఆ కథను రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం సిద్దుకి దక్కింది. ఇప్పుడు సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో నితిన్ ఆ సినిమా మిస్ చేసుకోవడం పెద్ద లాస్‌గా మారిందనే కామెంట్స్ నెట్టింట వినిపిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో నితిన్ వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటూ కాస్త కష్టమైన దశలో ఉన్నాడు. అటువంటి సమయంలో “తెలుసుకదా” లాంటి ఫీల్‌గుడ్, కంటెంట్ డ్రైవన్ సినిమా అతని చేతులారా జారిపోవడం తో అభిమానులు షాక్ అవుతున్నారు. “ఇలాంటి స్క్రిప్ట్‌ను వదులుకున్నాడంటే నిజంగా దురదృష్టమే”, “నితిన్ చేస్తే కూడా హిట్ అయ్యేదే కానీ, సిద్దు చేసాడు కాబట్టి సినిమా ఫ్రెష్‌గా అనిపించింది” అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక సిద్దు విషయానికి వస్తే – ఈ సినిమా తర్వాత అతని మార్కెట్ మరింత పెరిగింది. స్టైల్, హావభావాలు, డైలాగ్ డెలివరీతో యువతలో మాస్ క్రేజ్ పెరిగిపోయింది. మొత్తానికి నితిన్ వదిలిన “తెలుసుకదా” సిద్దుకి గోల్డెన్ హిట్‌గా మారింది అంటున్నారు సినీ వర్గాలు.

Exit mobile version