OTT Effect: ఓటీటీ నా మజాకా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా నిర్మాతల మండలి ఇటీవల సినిమా రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే షరతు విధించింది. అయితే విడుదలైన సినిమాల ఫలితంతో అన్నీ తలక్రిందులు అవుతున్నాయి. దాంతో ఏ సినిమా కైనా డిజిటల్ రిలీజ్ అనేది ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటోంది. ఈ విషయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నిర్ణయమే సుప్రీమ్ అని ఇటీవల డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో విడుదలైన సినిమాలను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.
అల్లు అర్జున్ ‘పుష్ప’ నుంచి తాజాగా విడుదల అవుతున్న కమల్ హాసన్ ‘పుష్ప’ వరకూ ఓటీటీ నిర్ణయమే శిరోధార్యమని తేలింది. డిసెంబర్ 17, 2021లో విడుదలై విజయం సాధించిన ఐకాన్ స్టార్ బన్నీ ‘పుష్ప’ నెలలోపుగానే ఓటీటీలో ప్రత్యక్షం అయింది. ఇక బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కెజిఎఫ్2’ 48 రోజుల్లో డిజిటల్ లో అందుబాటులోకి వచ్చింది. ప్రిన్స్ మహేశ్ నటించిన ‘సర్కారు వారి పాట’ 40 రోజులు కాకముందే ఓటీటీలో చూడండి అంటూ మురపించింది. ఇద్దరు స్టార్ హీరోలతో అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా పట్టుమని 46 రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ పై దర్శనం ఇచ్చి సత్తా చాటుతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించి ‘ఆచార్య’ అయితే 20 రోజులకే డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. నాని నటించిన ‘అంటే సుందరానికి’ 30 రోజుల్లో, అడవిశేష్ ప్రతిష్టాత్మకం అని చాటుకుంటున్న ‘మేజర్’ సైతం 30డేస్ లో ఓటీటీ ప్రదర్శనకు సిద్ధం అయిపోయాయి.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
మాజీ లవర్‌పై సారా, జాన్వీ సెటైర్
కమల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఇప్పటికీ మంచి షేర్స్ తో రన్ అవుతున్న ‘విక్రమ్’ సినిమా ఆశ్చర్యకరంగా 35 రోజుల్లోనే ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైపోయింది. మిగతా సినిమాలంటే థియేటర్లలో నిల్ షేర్ తో ఓటీటీలో ప్రత్యక్షం అయ్యాయనుకుంటే ‘విక్రమ్’ మాత్రం అందుకు భిన్నంగా మంచి షేర్ వస్తున్న టైమ్ లోనే ఓటీటీలోకి వస్తోంది. ఇది ఓ రకంగా పంపిణీదారులకు శరాఘాతమే. దీనిని బట్టి నిర్మాతలమండలి, ఫిలిమ్ ఛాంబర్ కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పవర్ ఫుల్ అని అర్థం అవుతోంది. దీనిపై నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?