NTV Telugu Site icon

Movies Releasing This Week: నిఖిల్ ‘స్పై’తో పాటు ఐదు సినిమాలు.. రెండు రీ రిలీజులు!

Movies Releasing This Week

Movies Releasing This Week

Telugu Movies Releasing This Week: ఈ వారం థియేట‌ర్ల‌లో ఏకంగా ఎనిమిది సినిమాలు సంద‌డి చేయ‌బోతున్నాయి. యంగ్ హీరోలు నిఖిల్‌ స్పై సినిమాతో, శ్రీవిష్ణు సామజవరగమన సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ‌బోతుండగా శుక్ర‌వారం నాడు మరిన్ని సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇక ముందుగా నిఖిల్ స్పై సినిమా విషయానికి వస్తే కార్తికేయ -2 ఘ‌న విజ‌యం త‌ర్వాత నిఖిల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ సినిమాతో ఎడిట‌ర్ గ్యారీ బీహెచ్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తుండగా రాజశేఖర్ రెడ్డి కధ అందించడమే కాదు నిర్మిస్తున్నారు కూడా. ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో ఆర్య‌న్ రాజేష్, స‌న్య ఠాకూర్ కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తుండగా రానా అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఇక గ‌త కొంత‌కాలంగా స‌రైన క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న శ్రీవిష్ణు జూన్ 29న సామ‌జ‌ర‌వ‌ర‌గ‌మ‌న సినిమాతో బాక్సాఫీస్ ముందుకు రానున్నాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌కుడు కాగా రెబా మౌనికా జాన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Samajavaragamana Review: ‘సామజవరగమన’ రివ్యూ

అనిల్ సుంక‌ర స‌మ‌ర్ప‌ణ‌లో రాజేష్ దండా ఈ మూవీని నిర్మించగా ఇప్పటికే ప్రీమియర్స్ కి మంచి టాక్ వచ్చింది. ఇవి కాక సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కే ద‌శ‌ర‌థ్ క‌థ‌ను అందిస్తూ డీవై చౌద‌రి దర్శకత్వంలో నిర్మించిన ల‌వ్ యూ రామ్ మూవీ జూన్ 30న విడుద‌ల‌కానుంది. ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ మూవీలో రోహిత్ బెహ‌ల్‌, అప‌ర్ణ జ‌నార్ధ‌న‌న్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక పాయ‌ల్ రాజ్‌పుత్‌, విరాజ్ అశ్విన్‌, సిమ్ర‌త్ కౌర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మాయా పేటిక సినిమా కూడా జూన్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ద‌ర్శ‌కుడు ర‌మేష్ రాప‌ర్తి మాయాపేటిక సినిమాను తెర‌కెక్కించారు. సింగ‌ర్ విజ‌య్ ఏసుదాస్ హీరోగా న‌ టించిన‌ మ‌ల‌యాళ మూవీ సాల్‌మ‌న్ సినిమా, నారాయణ అండ్ కో అనే సినిమా కూడా తెలుగులో రిలీజ్ కానుంది. అలాగే హాలీవుడ్ సినిమా ఇండియా జోన్స్ తెలుగులో అదే రోజున థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఇక ఇవి కాక రెండు సినిమాల రీ రిలీజులు ఉన్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి ప్రేమ‌, తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.

Show comments