Site icon NTV Telugu

Tollywood Shooting Updates: హైదరాబాద్లో ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్.. షూట్స్ ఎక్కడంటే?

Shooting Updates

Shooting Updates

Tollywood Shooting Updates: టాలీవుడ్ కు సంబంధించిన నాలుగు పెద్ద సినిమాల షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఆ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఎన్టీఆర్ దేవర విషయానికి వస్తే దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్కేల్‌లో రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా `దేవర` సినిమాకి సంబంధించిన షూటింగ్‌ అప్‌ డేట్‌ విషయానికి వస్తే ఎన్టీఆర్ సహా ఇతరుల మీద శంషాబాద్ లో షూట్ జరుగుతోంది. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లోని ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ గురించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ సీన్స్ షూటింగ్ నిన్నటితో ముగిసింది అని అంటున్నారు.

National Film Awards 2023 live updates: బెస్ట్ యాక్టర్ రేసులో దూసుకుపోతున్న అల్లు అర్జున్!

అంతేకాక వారం రోజుల్లో చిత్రీకరించాల్సి సీన్లు మూడు రోజుల్లోనే పూర్తి చేసేశారట. ఇక రేపటి నుంచి హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో గుంటూరు కారం కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది అని తెలుస్తోంది. మరోపక్క కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఈగల్’ చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మిగిలిన షూటింగ్ కోసం రవితేజ లండన్ వెళ్లగా అక్కడే చివరి షెడ్యూల్ షూట్ చేస్తున్నారు. ఇక ఇంకో పక్క సుకుమార్ దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో పుష్ప2ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప2 లేటెస్ట్ షెడ్యూల్‌ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పుష్పరాజ్ ఎర్రచందనం దుంగలను ఓ ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి త‌ర‌లించే ప‌నిలో ఉంటే షెకావ‌త్ సార్ పుప్ప‌రాజ్‌ని ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నాడని అంటున్నారు.

Exit mobile version