Site icon NTV Telugu

Telugu Indian Idol: ట్రెండ్ సెట్ చేయబోతున్న షో!

Indian Ideal

Indian Ideal

ఆహా సంస్థ నిర్వహిస్తున్న ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ కార్యక్రమం సమ్ థింగ్ స్పెషల్ గా సాగుతోంది. ఈ కార్యక్రమానికి అతిథులను తీసుకొచ్చే విషయంలోనూ వైవిధ్యతను నిర్వాహకులు ప్రదర్శిస్తున్నారు. ఈ వీకెండ్ లో స్ట్రీమింగ్ అయ్యే 19, 20 ఎపిసోడ్స్ లో అలాంటి ఓ ప్రత్యేకత చోటు చేసుకోబోతోంది.

శుక్ర, శనివారాల్లో రాత్రి 9 గంటలకు ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇందులో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరంతా ఒక్కో వారం ఒక్కో అంశం మీద పాటలు పాడుతున్నారు. మధ్య మధ్యలో ఈ షోకు గెస్ట్ లు కూడా హాజరవుతున్నారు. అలా వచ్చే వారాంతంలో ఈ షోకు ఇండియన్ క్రికెటర్ హనుమ విహారి వస్తున్నాడు. అలానే స్టార్ ప్లే బ్యాక్ సింగర్స్ హేమచంద్ర, అతని భార్య శ్రావణ భార్గవి; పృథ్వీచంద్ర, మోహన భోగరాజు, దామిని ఈ షో కు గెస్టులుగా హాజరవుతున్నారు. సో… ఆ రకంగా ఈ వీకెండ్ తెలుగు ఇండియన్ ఐడిల్ వీక్షకులకు డబుల్ థమాకా అనుకోవచ్చు. పార్టిసిపెంట్స్ హండ్రెడ్ పర్శంట్ ప్రతిభను కనబరుస్తుంటే, మరో పక్క క్రేజీ గెస్టులను షోకు తీసుకొస్తూ… ఓ సరికొత్త ట్రెండ్ ను ఆహా సెట్ చేసే ప్రయత్నంలో ఉంది.

Exit mobile version