NTV Telugu Site icon

TFPC: డబ్బిచ్చినా పాయల్ సహకరించ లేదు.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన

Payal Rajput Movie

Payal Rajput Movie

Telugu Film Producers Council Releases a Press Note on Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన రక్షణ మూవీకి సంబంధించి ఒక వివాదం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎప్పుడో నటించానని, అయితే తనకు ఇవ్వాల్సిన డబ్బు క్లియర్ చేయకుండా ఇప్పుడు ప్రమోషన్స్ కి రమ్మని పిలుస్తున్నారని పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం మీద నిర్మాత తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేసిన అంశం మీద ఒక కీలక ప్రకటన రిలీజ్ చేశారు. రక్షణ అనే సినిమాకి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ప్రాణదీప్ ఠాకూర్ పాయల్ రాజ్ పుత్ అగ్రిమెంట్ చేసుకున్న విధంగా కాకుండా తనకు ప్రమోషన్స్ విషయంలో సహకరించడం లేదని పేర్కొన్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్ధమై పాయల్ రాజ్ పుత్ ని ప్రమోషన్స్ చేయమని అడిగితే నాలుగేళ్ల పాత సినిమా కాబట్టి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయమని ఆమె సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Jani Master: రేవ్ పార్టీలో జానీ మాస్టర్.. అసలు విషయం చెప్పేశాడు!

అయితే అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా కోసం పాయల్ 50 రోజులు పని చేయాల్సి ఉంది. అయితే నిర్మాత 47 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. అలాగే అగ్రిమెంట్ ప్రకారం 50 రోజులతో పాటు అన్ని రకాల సినిమా ప్రమోషన్స్ కి పాయల్ రాజ్పుత్ హాజరు కావాల్సి ఉంటుంది. ఇంకా తాను ఇవ్వాల్సిన ఆరు లక్షలు పాయల్ రాజ్ పుత్ కి చెక్కు రూపంలో చెల్లించానని, సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ పూర్తి చేస్తే ఆ చెక్ క్లియర్ చేసేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. అయితే పాయల్ రాజ్ పుత్ ప్రమోషన్స్ కి రాకపోవడం వల్ల తను చాలా నష్ట పోయానని సినిమాని విడుదల కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని నిర్మాతల మండలికి ప్రాణదీప్ ఫిర్యాదు చేశారు. నిజానికి పాయల్ ప్రియుడు సౌరబ్ డింగ్రా ఆమెకు మేనేజర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

పాయల్ ప్రమోషన్స్ లో పాల్గొంటే ఆమెకు రావాల్సిన ఆరు లక్షలు క్లియర్ చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్మాత చెప్పినా సరే నాలుగేళ్ల పాత సినిమా కాబట్టి తాను ప్రమోట్ చేయనని పాయల్ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ ఫిర్యాదుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఫార్వర్డ్ చేసింది. అయితే పాయల్ రాజ్ పుత్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ కాదని చెప్పడంతో ఇప్పుడు ఇదే విషయాన్ని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కి కౌన్సిల్ ఫార్వర్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నెల నుంచి క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంటే సోషల్ మీడియాలో పాయల్ రాజ్ పుత్ తన వైపు నుంచి ఏం తప్పే లేదు అన్నట్టు పోస్ట్ పెట్టుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాయల్ పేరు ఫోటోలు వాడుకోవడంలో తప్పేమీ లేదని ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వెల్లడించింది.

Show comments