Site icon NTV Telugu

‘మా’ ఎన్నికల సందర్భంగా నిర్మాతల మండలి నిర్ణయం!

Telugu Film Producers Council Decision for MAA Elections

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఏ తేదీన పెట్టాలనే విషయంలో కార్యవర్గం, ఎన్నికల నిర్వహణ కమిటీ ఎంతో మల్లగుల్లాలు పడ్డాయి. సెప్టెంబర్ లో ఏదో ఒక ఆదివారం పెట్టే కంటే… అక్టోబర్ 10వ తేదీ సెకండ్ సండే పెడితే, అందరికీ సౌలభ్యంగా ఉంటుందని ఏకాభిప్రాయానికి వచ్చింది. ఆ ప్రకారమే మరో మూడు రోజుల్లో ‘మా’ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటి వరకూ ‘మా’ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… ఫిల్మ్ ఛాంబర్ భవంతిలోనే జరిగాయి. అందులోని సెకండ్ ఫ్లోర్ లో ఉన్న నిర్మాతల మండలి హాల్ లో ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉండేది. అయితే ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించడానికి, ఓట్ చేయడానికి వచ్చే ఆర్టిస్టుల వెహికిల్ పార్కింగ్ కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో ఈసారి ఫిల్మ్ నగర్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Read Also : ‘వేధింపులు’ అంటూ సమంత స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్

సహజంగా రెండో ఆదివారం సినిమా షూటింగ్స్ కు సెలవు. అయితే కొంతమంది నిర్మాతలు ముందే షెడ్యూల్ వేసుకోవడంతో ఆదివారం కూడా షూటింగ్స్ నిర్వహిస్తుంటారు. ఇప్పుడు కూడా కొంతమంది నిర్మాతలు ఆదివారం షూటింగ్స్ పెట్టుకున్నారు. అయితే ‘మా’ ఎన్నికల అధికారి వి. కృష్ణమోహన్ అభ్యర్థన మేరకు ఆ రోజు ఉదయం షూటింగ్స్ ఏవీ జరుపవద్దని, ఆర్టిస్టులు ఓటు హక్కు వినియోగించుకుని, రెండు గంటల తర్వాత షూటింగ్ కు హాజరు అవుతారని, వారికి సహకరించాలని కోరుతూ, తెలుగు నిర్మాతల మండలి తమ నిర్మాతలకు విజ్ఞప్తి చేసింది. రాబోయే ఆదివారం ‘మా’ ఎన్నికల పోలింగ్ ఉదయం గం. 8.00 నుండి మధ్యాహ్నం గం. 2.00 వరకూ జరుగనుంది. అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలను సైతం ప్రకటిస్తామని ఎన్నికల అధికారి వి. కృష్ణమోషన్ తెలిపారు.

Exit mobile version