టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించిన ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. సినిమాలకు పని చేసే వివిధ క్రాఫ్ట్స్ లోని కార్మికుల రోజు వారి వేతనాలను (30%) పెంచి ఇచ్చిన వారికి రేపటి నుంచి షూటింగ్ లో పాల్గొంటామని తేల్చి చెప్పిన ఫెడరేషన్ నాయకులు. కార్మికులకు ప్రతీ మూడేళ్లకోసారి 30% పెంచాలనే నిబంధన గత నెల జూన్ 30వ తేదీతో ముగిసింది. దాంతో నిబంధనలకు అనుగుణంగా వేతనం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేతనాలు పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ కు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మధ్య ఇరువురు మధ్య నిన్న వాడివేడిగ జరిగిన చర్చల్లో వేతనాల పెంపుకు ఫిలిం ఛాంబర్ ససేమిరా అన్నాడంతో సమ్మె కు పిలుపు నిచ్చాయి కార్మిక సంఘాలు.
ఈ నేపధ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్మాతలకు చిన్న పాటి హెచ్చరిక జారీ చేసింది. నిర్మాతలకు ముఖ్యమైన సందేశం. అందరు నిర్మాతలకు మరియు సంబంధిత నిర్మాణ సంస్థలకు ముఖ్యముగా తెలియజేసేది ఏమనగా, వర్కర్స్ ఫెడరేషన్ వారు కోరినట్లుగా వారి పక్షాన మీ సొంత ప్రయోజనాల కోసం వేతనాలను పెంచుతూ ఎటువంటి లేఖలైనా జారీ చేయవద్దు. ఈ రోజు 03/08/2025 తేదీన ఫెడరేషన్ మీడియాకు విడుదల చేసిన లేఖకు సంబంధించి ఏవైనా వివరాల కోసం తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ని సంప్రదించగలరు. వర్కర్స్ ఫెడరేషన్ పేర్కొన్న వేతన పెంపును తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అంగీకరించలేదు అని తెలిపారు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఛాంబర్ గౌరవ కార్యదర్శి K.L. దామోదర ప్రసాద్.
