Film Chamber Elections 2023: తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి ఇప్పటికే ఈ నెల 14వ తేదీతో నామినేషన్ స్ఫూర్తిగా ఈ రోజుతో నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి కూడా గడువు పూర్తయింది ఇక జూలై 30వ తేదీన ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా సి.కళ్యాణ్, దిల్ రాజు బ్యానర్స్ మధ్య పోటీ ఉండబోతుందని, వారిద్దరూ అధ్యక్ష బరిలో కూడా దిగబోతున్నారని చెబుతున్నారు. ఫిలిం ఛాంబర్ కి సంబంధించి తెలుగు నిర్మాతల సెక్టార్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్, స్టూడియో సెక్టార్ కి ఎన్నికలు జరగబోతుండగా ఇప్పటికీ ఎగ్జిబిటర్ సెక్టర్ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవం అయింది. దీంతో మిగిలిన డిస్ట్రిబ్యూటర్ సెక్టర్, తెలుగు నిర్మాతల సెక్టార్ కి ఎన్నికల జరగబోతున్నాయి.
Sreeleela: ఈ అందాన్ని ఏ హీరో వదులుతాడు.. చెప్పండి
ఇప‍్పటికే టాలీవుడ్‌లో ఎన్నో కీలక పదవుల్లో పనిచేసిన సి.కల్యాణ్, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఏర్పాటు చేసుకుని నిర్మాతల మండలిలో కీలకంగా ఉన్న దిల్ రాజు ప్యానెల్స్ తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఫిబ్రవరిలో జరిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల కోసం దిల్ రాజు, సి కళ్యాణ్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు మీడియా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఒక వర్గం మీద మరో వర్గం అప్పట్లో తీవ్ర ఆరోపణలు కూడా చేసుకోవడం మీడియాకి ఎక్కడం హాట్ టాపిక్ అయింది. ఆ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ఏకపక్షంగా గెలవడంతో ఆ విజయాన్ని చూసి నిర్మాతల మండలిని గిల్డ్ స్వాధీనం చేసుకుందని కూడా కామెంట్లు చేశారు. సి కళ్యాణ్, దిల్ రాజుల మధ్య మరో వార్ ఎలా జరుగుతుందో చూడాలి మరి.
