Zee Telugu : ‘జానకి రామయ్యగారి ఇంట అమ్మాయిగారు పుట్టినరోజు వేడుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్, ప్రత్యేక కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. రెట్టింపు వినోదాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే జీ తెలుగు తాజాగా బాపట్ల వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది. మీ అభిమాన జీ తెలుగు సీరియల్స్ అమ్మాయిగారు, జానకిరామయ్యగారి మనవరాలు నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది. అభిమాన ప్రేక్షకుల మధ్య బాపట్ల శాసన సభ సభ్యుడు నరేంద్రవర్మ ముఖ్యఅతిథిగా కోలాహలంగా జరిగిన కార్యక్రమం ‘జానకి రామయ్యగారి ఇంట అమ్మాయిగారు పుట్టినరోజు వేడుక’ ఈ ఆదివారం, జులై 7న రాత్రి 7 గంటలకు మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!
జీ తెలుగు ఇటీవల బాపట్లలో ప్రముఖ నటీనటులతో కార్యక్రమాన్ని నిర్వహించి వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించింది. ఈ కార్యక్రమం ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానుంది. మీ అభిమాన నటి గౌతమి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచింది. జీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న అమ్మాయిగారు, జానకి రామయ్యగారి మనవరాలు నటీనటులు ఈ వేదికపై నుంచి తమ అభిమానులతో సంభాషించి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. రెండు సీరియల్స్ నుంచి హాజరైన నటీనటుల అదిరిపోయే ఎంట్రీతో ఆరంభమైన కార్యక్రమం కోలాహలంగా సాగింది. రూప(నిషా రవికృష్ణన్) పుట్టినరోజు వేడుక జరిపేందుకు ఆమె తండ్రి సూర్యప్రతాప్(అనిల్), భర్త రాజు (యశ్వంత్) మధ్య జరిగిన సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. వారిద్దరికీ అంకితం చేస్తూ రూప పాడిన పాట కంటతడి పెట్టించింది. ఇక, ఎవర్గ్రీన్ సరిగమప గాయనీగాయకుల ప్రత్యేక ప్రదర్శన వీక్షకుల హృదయాలను హత్తుకుంది.
జీ తెలుగు తారలు, అభిమానులతో సంగ్రామంలా సాగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల శాసనసభ సభ్యులు నరేంద్రవర్మ హాజరై అందరిలో మరింత ఉత్సాహం నింపారు. ఈ వేదికపై ఓ వికలాంగురాలిని సన్మానించి సమాజ స్ఫూర్తి, మద్దతును తెలియజేశారు. డ్రామా జూనియర్స్ పిల్లలు ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ మేనరిజంతో చేసిన అల్లరి అందరినీ కడుపుబ్బా నవ్వించింది.
జీ తెలుగు నటీనటులు తమ అభిమానులతో సెల్ఫీలు దిగడం, బహుమతులతో సర్ ప్రైజ్ చేయడంతోపాటు వారిని పలకరించి ముచ్చటించారు. దేవాలయాల సందర్శన నుంచి అభిమానుల ఇళ్లలో ఆనందాన్ని పంచడం వరకు అమ్మాయిగారు, జానకిరామయ్యగారి మనవరాలు సీరియల్స్ నటీనటులు చెరగని అనుభూతులు పంచారు. ఘనంగా జరిగిన ఈ సరదా సంబరాన్ని జీ తెలుగు వేదికగా మీరూ మిస్ కాకుండా చూసేయండి!
Also Read
ఘనంగా జరిగిన జానకి రామయ్యగారి ఇంట అమ్మాయిగారు పుట్టినరోజు వేడుక ప్రత్యేక కార్యక్రమం, ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!
- Tags
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!