ZEE : డ్రామా జూనియర్స్ 8వ సీజన్ కు హోస్ట్ గా అనిల్ రావిపూడి, రోజా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంవత్సరాల నుంచి ప్రేక్షకులు హృదయాలను గెలుచుకున్న డ్రామా జూనియర్స్ 8వ సీజన్తో మరోసారి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమైంది. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్లోని పిల్లల్లో దాగున్న నటనా ప్రతిభను వెలికి తీసే ఉద్దేశ్యంతో కొత్త సీజన్ని ప్రారంభిస్తోంది. ఈ షో ను ఎవర్గ్రీన్ ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ హోస్ట్ చేయనున్నారు. పిల్లల స్కిట్లకీ, సుధీర్ కామెడీ పంచులు, టైమింగ్ తోడైతే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం.
ప్రతిభ గల చిన్నారులను మరింత ప్రోత్సహించి వారిని ఆశీర్వదించేందుకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, నటి రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. వరుస హిట్ సినిమాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా రాణిస్తున్న అనిల్ రావిపుడి జీ తెలుగు డ్రామా జూనియర్స్ 8 షో ద్వారా బుల్లితెరపై మొదటిసారిగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఇక, డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ముఖ్య అతిథులుగా ప్రముఖ నటులు జగపతి బాబు, ఆమని హాజరై చిన్నారుల్లో మరింత ఉత్సాహం నింపనున్నారు. వీళ్ళ నటనా ప్రతిభ కనబరిచే అద్భుతమైన ప్రదర్శనలు, సరదా సంభాషణలతో డ్రామా జూనియర్స్ సీజన్ 8 ఘనంగా ప్రారంభం కానుంది. ఇక, ఈ సీజన్లో పాల్గొనే చిన్నారులు రెండు జట్లు బాయ్స్ టీమ్, గర్ల్స్ టీమ్ గా తలపడనున్నారు. గర్ల్స్ టీమ్ కి యాంకర్ లాస్య, బాయ్స్ టీమ్ కి త్రినయని సీరియల్ తో జీ తెలుగు ప్రేక్షకులను అలరించిన అశికా పదుకొణె మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. మెంటర్ల సారథ్యంలో అలరించే స్కిట్స్ తో అంతులేని వినోదం పంచే ఈ కార్యక్రమాన్ని జీ తెలుగు వేదికగా ప్రతి శనివారం మీరూ తప్పకుండా చూడండి!
Also Read
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!