యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్స్ ను చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా తన సత్తాను కొనసాగిస్తుంది.. అంతేకాదు ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్న సుమ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది.. తాజాగా పండక్కి అదిరిపోయే వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
ఈరోజు ఉగాది సందర్బంగా సుమ ఓ వీడియోను షేర్ చేసింది.. పండగంటే పులిహోర లేకుండా ఎలా పులిహోర రడీ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.. ఆ వీడియో పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ప్రతి పండక్కి ఇదే పని చేస్తున్నావా సుమక్క అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. పండగొస్తే చాలు ఇదే పనినా సుమ నీకు అని కొందరు కామెంట్స్ చేస్తూన్నారు.. మొత్తానికి వీడియో తెగ ట్రెండ్ అవుతుంది..
ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ. దశాబ్దాలు తరబడి యాంకరింగ్ చేస్తున్నా బోర్ కొట్టని మాటలతో ఆకట్టుకుంటుంది.. ఇకపోతే సుమ బుల్లితెర పై పలు షోలు చేస్తుంది.. అలాగే సినిమా ఈవెంట్స్ లను చేస్తూ బాగానే వెనకేస్తుంది.. ఇటీవలే తన కొడుకు రోషన్ కూడా సినిమాల్లోకి వచ్చాడు.