Site icon NTV Telugu

Nagarjuna: నాగార్జునపై వ్యాఖ్యలకి చింతిస్తున్నా.. మంత్రి కొండా సురేఖ ట్వీట్‌

Nagarjuna Konda Surekha

Nagarjuna Konda Surekha

గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ నిన్న అర్ధరాత్రి పొద్దు బోయాక ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నానని ఆమె తెలిపారు. “నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు” అని మంత్రి కొండా సురేఖ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. అక్కినేని నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టే లేదా అప్రతిష్టపాలు చేసే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆమె పేర్కొన్నారు.

Also Read :Rajamouli : రాజమౌళిని చూసి మిగతా డైరెక్టర్లు నేర్చుకోండయ్యా..

తన వ్యాఖ్యల కారణంగా వారికి ఏదైనా అవాంఛిత అభిప్రాయం కలిగి ఉంటే అందుకు చింతిస్తున్నానని, తాను చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ తెలిపారు. నిజానికి, నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో, ఆమె వెంటనే స్పందించి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం గమనార్హం. ఎప్పుడో నాగార్జున కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ చాలా కాలం తర్వాత ఇలా స్పందించడం గమనార్హం. ఈ అంశం మీద నాగార్జున ఫ్యామిలీ కోర్టుకు కూడా వెళ్లారు. ఇక ఈ ట్వీట్‌తో ఈ వివాదం సద్దుమణగవచ్చని భావిస్తున్నారు.

Exit mobile version